Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #150 Translated in Telugu

وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا كُلَّ ذِي ظُفُرٍ ۖ وَمِنَ الْبَقَرِ وَالْغَنَمِ حَرَّمْنَا عَلَيْهِمْ شُحُومَهُمَا إِلَّا مَا حَمَلَتْ ظُهُورُهُمَا أَوِ الْحَوَايَا أَوْ مَا اخْتَلَطَ بِعَظْمٍ ۚ ذَٰلِكَ جَزَيْنَاهُمْ بِبَغْيِهِمْ ۖ وَإِنَّا لَصَادِقُونَ
మరియు యూదమతం అవలంబించిన వారికి మేము గోళ్ళు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. మరియు వారికి ఆవు మరియు మేకలలో, వాటి వీపులకు లేదా ప్రేగులకు తగిలివున్న మరియు ఎముకలలో మిశ్రమమై ఉన్న క్రొవ్వు తప్ప, మిగతా (క్రొవ్వును) నిషేధించాము. ఇది వారి అక్రమాలకు విధించిన శిక్ష. మరియు నిశ్చయంగా, మేము సత్యవంతులము
فَإِنْ كَذَّبُوكَ فَقُلْ رَبُّكُمْ ذُو رَحْمَةٍ وَاسِعَةٍ وَلَا يُرَدُّ بَأْسُهُ عَنِ الْقَوْمِ الْمُجْرِمِينَ
(ఓ ముహమ్మద్!) ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే!" నీవు వారితో ఇలా అను: మీ ప్రభువు కారుణ్య పరిధి సువిశాలమైనది. కాని ఆయన శిక్ష పాపిష్ఠి ప్రజలపై పడకుండా నివారించబడదు
سَيَقُولُ الَّذِينَ أَشْرَكُوا لَوْ شَاءَ اللَّهُ مَا أَشْرَكْنَا وَلَا آبَاؤُنَا وَلَا حَرَّمْنَا مِنْ شَيْءٍ ۚ كَذَٰلِكَ كَذَّبَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ حَتَّىٰ ذَاقُوا بَأْسَنَا ۗ قُلْ هَلْ عِنْدَكُمْ مِنْ عِلْمٍ فَتُخْرِجُوهُ لَنَا ۖ إِنْ تَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ أَنْتُمْ إِلَّا تَخْرُصُونَ
అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించేవారు అంటారు: ఒకవేళ అల్లాహ్ కోరితే మేము గానీ, మా తండ్రితాతలు గానీ ఆయనకు సాటి కప్పించే వారమూ కాము మరియు దేనినీ నిషేధించి ఉండేవారమూ కాము." వారికి పూర్వం వారు కూడా మా శిక్షను రుచి చూడనంత వరకు ఇదే విధంగా తిరస్కరించారు. వారిని అడుగు: మీ వద్ద ఏదైనా (రూఢి అయిన) జ్ఞానం ఉందా! ఉంటే మా ముందు పెట్టండి. మీరు కేవలం కల్పనలను అనుసరిస్తున్నారు మరియు మీరు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు
قُلْ فَلِلَّهِ الْحُجَّةُ الْبَالِغَةُ ۖ فَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ
ఇలా అను: రూఢి అయిన ప్రమాణం అల్లాహ్ వద్దనే ఉంది. ఆయన గనక తలచుకుని ఉంటే మీ అందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు
قُلْ هَلُمَّ شُهَدَاءَكُمُ الَّذِينَ يَشْهَدُونَ أَنَّ اللَّهَ حَرَّمَ هَٰذَا ۖ فَإِنْ شَهِدُوا فَلَا تَشْهَدْ مَعَهُمْ ۚ وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَهُمْ بِرَبِّهِمْ يَعْدِلُونَ
(ఇంకా) ఇలా అను: `నిశ్చయంగా, అల్లాహ్ ఈ వస్తువులను నిషేధించాడు.` అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకొని రండి." ఒకవేళ వారు అలా సాక్ష్యమిస్తే, నీవు వారితో కలిసి సాక్ష్యమివ్వకు. మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించే వారి మరియు పరలోకము నందు విశ్వాసం లేని వారి మరియు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టే వారి మనోవాంఛలను నీవు ఏ మాత్రం అనుసరించకు

Choose other languages: