Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #51 Translated in Telugu

نَحْنُ أَعْلَمُ بِمَا يَسْتَمِعُونَ بِهِ إِذْ يَسْتَمِعُونَ إِلَيْكَ وَإِذْ هُمْ نَجْوَىٰ إِذْ يَقُولُ الظَّالِمُونَ إِنْ تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَسْحُورًا
వారు నీ మాటలను వింటున్నప్పుడు, వారు ఏమి వింటున్నారో మాకు బాగా తెలుసు. ఈ దుర్మార్గులు ఏకాంతంలో ఉన్నప్పుడు పరస్పరం గుసగుసలాడుతూ ఇలా చెప్పుకుంటారు: మీరు అనుసరిస్తున్న ఈ మనిషి కేవలం మంత్రజాలానికి గురి అయిన వాడు మాత్రమే
انْظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا
(ఓ ముహమ్మద్!) చూడు! వారు నిన్ను ఎలాంటి ఉదాహరణలతో పోల్చుతున్నారో, ఎందుకంటే వారు మార్గం తప్పారు, కావున వారు (సరైన) మార్గం పొందలేరు
وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا
మరియు వారు ఇలా అంటారు: ఏమీ? మేము ఎముకలుగా మరియు దుమ్ముగా (పొడిగా) మారిపోయిన తరువాత కూడా తిరిగి క్రొత్త సృష్టిగా లేపబడతామా
قُلْ كُونُوا حِجَارَةً أَوْ حَدِيدًا
వారితో అను: మీరు రాళ్ళుగా గానీ, లేదా ఇనుముగా గానీ మారిపోయి ఉండినా సరే
أَوْ خَلْقًا مِمَّا يَكْبُرُ فِي صُدُورِكُمْ ۚ فَسَيَقُولُونَ مَنْ يُعِيدُنَا ۖ قُلِ الَّذِي فَطَرَكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ فَسَيُنْغِضُونَ إِلَيْكَ رُءُوسَهُمْ وَيَقُولُونَ مَتَىٰ هُوَ ۖ قُلْ عَسَىٰ أَنْ يَكُونَ قَرِيبًا
లేదా! తిరిగి సృష్టింపబడటానికి అసాధ్యమైనదని మీ హృదయాలు భావించే దానిగా ఉన్నా సరే! (తిరిగి లేపబడతారు)". వారు మళ్ళీ ఇలా అడుగుతారు: మమ్మల్ని తిరిగి బ్రతికించి లేపగల వాడు ఎవడు?" వారితో అను: ఆయనే, మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన వాడు!" వారు ఎగతాళిగా తలలు ఊపుతూ అంటారు: అయితే! అది ఎప్పుడు సంభవిస్తుంది?" వారితో అను: బహుశా ఆ సమయం సమీపంలోనే ఉండవచ్చు

Choose other languages: