Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #50 Translated in Telugu

وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَنْ يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَىٰ أَدْبَارِهِمْ نُفُورًا
మరియు వారు గ్రహించకుండా, వారి హృదయాల మీద తెరలు మరియు వారి చెవులలో చెవుడు వేసి ఉన్నాము. ఒకవేళ నీవు ఖుర్ఆన్ (పారాయణం) తో నీ ప్రభువు యొక్క ఏకత్వాన్ని ప్రస్తావిస్తే వారు అసహ్యంతో వెనుదిరిగి మరలిపోతారు
نَحْنُ أَعْلَمُ بِمَا يَسْتَمِعُونَ بِهِ إِذْ يَسْتَمِعُونَ إِلَيْكَ وَإِذْ هُمْ نَجْوَىٰ إِذْ يَقُولُ الظَّالِمُونَ إِنْ تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَسْحُورًا
వారు నీ మాటలను వింటున్నప్పుడు, వారు ఏమి వింటున్నారో మాకు బాగా తెలుసు. ఈ దుర్మార్గులు ఏకాంతంలో ఉన్నప్పుడు పరస్పరం గుసగుసలాడుతూ ఇలా చెప్పుకుంటారు: మీరు అనుసరిస్తున్న ఈ మనిషి కేవలం మంత్రజాలానికి గురి అయిన వాడు మాత్రమే
انْظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا
(ఓ ముహమ్మద్!) చూడు! వారు నిన్ను ఎలాంటి ఉదాహరణలతో పోల్చుతున్నారో, ఎందుకంటే వారు మార్గం తప్పారు, కావున వారు (సరైన) మార్గం పొందలేరు
وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا
మరియు వారు ఇలా అంటారు: ఏమీ? మేము ఎముకలుగా మరియు దుమ్ముగా (పొడిగా) మారిపోయిన తరువాత కూడా తిరిగి క్రొత్త సృష్టిగా లేపబడతామా
قُلْ كُونُوا حِجَارَةً أَوْ حَدِيدًا
వారితో అను: మీరు రాళ్ళుగా గానీ, లేదా ఇనుముగా గానీ మారిపోయి ఉండినా సరే

Choose other languages: