Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #74 Translated in Telugu

ذَٰلِكَ الْفَضْلُ مِنَ اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ عَلِيمًا
అల్లాహ్ నుండి లభించే అనుగ్రహం ఇలాంటిదే. మరియు (యథార్థం) తెలుసుకోవటానికి అల్లాహ్ చాలు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا خُذُوا حِذْرَكُمْ فَانْفِرُوا ثُبَاتٍ أَوِ انْفِرُوا جَمِيعًا
ఓ విశ్వాసులారా! మీరు (అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధమై) తగిన జాగ్రత్తలు వహించండి! మీరు (యుద్ధానికి) జట్లుగానో లేదా అందరూ కలిసియో బయలు దేరండి
وَإِنَّ مِنْكُمْ لَمَنْ لَيُبَطِّئَنَّ فَإِنْ أَصَابَتْكُمْ مُصِيبَةٌ قَالَ قَدْ أَنْعَمَ اللَّهُ عَلَيَّ إِذْ لَمْ أَكُنْ مَعَهُمْ شَهِيدًا
మరియు వాస్తవానికి మీలో వెనుక ఉండి పోయేవాడు ఉన్నాడు. ఒకవేళ మీకు ఏమైనా ఆపద వస్తే అప్పుడు వాడు: వాస్తవానికి అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు, అందుకే నేను కూడా వారితో పాటు లేను!" అని అంటాడు
وَلَئِنْ أَصَابَكُمْ فَضْلٌ مِنَ اللَّهِ لَيَقُولَنَّ كَأَنْ لَمْ تَكُنْ بَيْنَكُمْ وَبَيْنَهُ مَوَدَّةٌ يَا لَيْتَنِي كُنْتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا
మరియు ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి అనుగ్రహమే లభిస్తే! మీకూ అతనికి మధ్య ఏ విధమైన అనురాగబంధమే లేనట్లుగా: అయ్యో! నేను కూడా వారితో పాటు ఉండి ఉంటే నాకు కూడా గొప్ప విజయ ఫలితం లభించి ఉండేది కదా!" అని తప్పక అంటాడు
فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يَشْرُونَ الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۚ وَمَنْ يُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
కావున ఇహలోక జీవితాన్ని పరలోక జీవిత (సుఖానికి) బదులుగా అమ్మిన వారు (విశ్వాసులు), అల్లాహ్ మార్గంలో పోరాడాలి. మరియు అల్లాహ్ మార్గంలో పోరాడిన వాడు, చంపబడినా, లేదా విజేయుడైనా, మేము తప్పకుండా అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలము

Choose other languages: