Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #77 Translated in Telugu

وَلَئِنْ أَصَابَكُمْ فَضْلٌ مِنَ اللَّهِ لَيَقُولَنَّ كَأَنْ لَمْ تَكُنْ بَيْنَكُمْ وَبَيْنَهُ مَوَدَّةٌ يَا لَيْتَنِي كُنْتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا
మరియు ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి అనుగ్రహమే లభిస్తే! మీకూ అతనికి మధ్య ఏ విధమైన అనురాగబంధమే లేనట్లుగా: అయ్యో! నేను కూడా వారితో పాటు ఉండి ఉంటే నాకు కూడా గొప్ప విజయ ఫలితం లభించి ఉండేది కదా!" అని తప్పక అంటాడు
فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يَشْرُونَ الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۚ وَمَنْ يُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
కావున ఇహలోక జీవితాన్ని పరలోక జీవిత (సుఖానికి) బదులుగా అమ్మిన వారు (విశ్వాసులు), అల్లాహ్ మార్గంలో పోరాడాలి. మరియు అల్లాహ్ మార్గంలో పోరాడిన వాడు, చంపబడినా, లేదా విజేయుడైనా, మేము తప్పకుండా అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలము
وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا وَاجْعَلْ لَنَا مِنْ لَدُنْكَ وَلِيًّا وَاجْعَلْ لَنَا مِنْ لَدُنْكَ نَصِيرًا
మరియు మీకేమయింది, మీరెందుకు అల్లాహ్ మార్గంలో మరియు నిస్సహాయులై అణచి వేయబడిన పురుషుల, స్త్రీల మరియు పిల్లల కొరకు, పోరాడటం లేదు? వారు: మా ప్రభూ! దౌర్జన్యపరులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు. నీ వద్ద నుండి మా కొరకు ఒక సంరక్షకుణ్ణి నియమించు. మరియు నీ వద్ద నుండి మా కొరకు ఒక సహాయకుణ్ణి ఏర్పాటు చేయి!" అని వేడుకుంటున్నారు
الَّذِينَ آمَنُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ ۖ وَالَّذِينَ كَفَرُوا يُقَاتِلُونَ فِي سَبِيلِ الطَّاغُوتِ فَقَاتِلُوا أَوْلِيَاءَ الشَّيْطَانِ ۖ إِنَّ كَيْدَ الشَّيْطَانِ كَانَ ضَعِيفًا
విశ్వసించిన వారు, అల్లాహ్ మార్గంలో పోరాడుతారు. మరియు సత్యతిరస్కారులు తాగూత్ మార్గంలో పోరాడుతారు; కావున మీరు (ఓ విశ్వాసులారా!) షైతాను అనుచరులను విరుద్ధంగా పోరాడండి. నిశ్చయంగా, షైతాను కుట్ర బలహీనమైనదే
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ قِيلَ لَهُمْ كُفُّوا أَيْدِيَكُمْ وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتَالُ إِذَا فَرِيقٌ مِنْهُمْ يَخْشَوْنَ النَّاسَ كَخَشْيَةِ اللَّهِ أَوْ أَشَدَّ خَشْيَةً ۚ وَقَالُوا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَيْنَا الْقِتَالَ لَوْلَا أَخَّرْتَنَا إِلَىٰ أَجَلٍ قَرِيبٍ ۗ قُلْ مَتَاعُ الدُّنْيَا قَلِيلٌ وَالْآخِرَةُ خَيْرٌ لِمَنِ اتَّقَىٰ وَلَا تُظْلَمُونَ فَتِيلًا
మీ చేతులను ఆపుకోండి, నమాజ్ ను స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి." అని చెప్పబడిన వారిని నీవు చూడలేదా? యుద్ధం చేయమని వారిని ఆదేశించినప్పుడు, వారిలో కొందరు అల్లాహ్ కు భయపడవలసిన విధంగా మానవులకు భయపడుతున్నారు. కాదు! అంతకంటే ఎక్కువగానే భయపడుతున్నారు. వారు: ఓ మా ప్రభూ! యుద్ధం చేయమని ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు విధించావు? మాకు ఇంకా కొంత వ్యవధి ఎందుకివ్వలేదు? అని అంటారు. వారితో ఇలా అను: ఇహలోక సుఖం తుచ్ఛమైనది మరియు దైవభీతి గలవారికి పరలోక సుఖమే ఉత్తమమైనది. మరియు మీకు ఖర్జూర బీజపు చీలికలోని పొర (ఫతీల) అంత అన్యాయం కూడా జరుగదు

Choose other languages: