Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #75 Translated in Telugu

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا خُذُوا حِذْرَكُمْ فَانْفِرُوا ثُبَاتٍ أَوِ انْفِرُوا جَمِيعًا
ఓ విశ్వాసులారా! మీరు (అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధమై) తగిన జాగ్రత్తలు వహించండి! మీరు (యుద్ధానికి) జట్లుగానో లేదా అందరూ కలిసియో బయలు దేరండి
وَإِنَّ مِنْكُمْ لَمَنْ لَيُبَطِّئَنَّ فَإِنْ أَصَابَتْكُمْ مُصِيبَةٌ قَالَ قَدْ أَنْعَمَ اللَّهُ عَلَيَّ إِذْ لَمْ أَكُنْ مَعَهُمْ شَهِيدًا
మరియు వాస్తవానికి మీలో వెనుక ఉండి పోయేవాడు ఉన్నాడు. ఒకవేళ మీకు ఏమైనా ఆపద వస్తే అప్పుడు వాడు: వాస్తవానికి అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు, అందుకే నేను కూడా వారితో పాటు లేను!" అని అంటాడు
وَلَئِنْ أَصَابَكُمْ فَضْلٌ مِنَ اللَّهِ لَيَقُولَنَّ كَأَنْ لَمْ تَكُنْ بَيْنَكُمْ وَبَيْنَهُ مَوَدَّةٌ يَا لَيْتَنِي كُنْتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا
మరియు ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి అనుగ్రహమే లభిస్తే! మీకూ అతనికి మధ్య ఏ విధమైన అనురాగబంధమే లేనట్లుగా: అయ్యో! నేను కూడా వారితో పాటు ఉండి ఉంటే నాకు కూడా గొప్ప విజయ ఫలితం లభించి ఉండేది కదా!" అని తప్పక అంటాడు
فَلْيُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يَشْرُونَ الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۚ وَمَنْ يُقَاتِلْ فِي سَبِيلِ اللَّهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
కావున ఇహలోక జీవితాన్ని పరలోక జీవిత (సుఖానికి) బదులుగా అమ్మిన వారు (విశ్వాసులు), అల్లాహ్ మార్గంలో పోరాడాలి. మరియు అల్లాహ్ మార్గంలో పోరాడిన వాడు, చంపబడినా, లేదా విజేయుడైనా, మేము తప్పకుండా అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలము
وَمَا لَكُمْ لَا تُقَاتِلُونَ فِي سَبِيلِ اللَّهِ وَالْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ الَّذِينَ يَقُولُونَ رَبَّنَا أَخْرِجْنَا مِنْ هَٰذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُهَا وَاجْعَلْ لَنَا مِنْ لَدُنْكَ وَلِيًّا وَاجْعَلْ لَنَا مِنْ لَدُنْكَ نَصِيرًا
మరియు మీకేమయింది, మీరెందుకు అల్లాహ్ మార్గంలో మరియు నిస్సహాయులై అణచి వేయబడిన పురుషుల, స్త్రీల మరియు పిల్లల కొరకు, పోరాడటం లేదు? వారు: మా ప్రభూ! దౌర్జన్యపరులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు. నీ వద్ద నుండి మా కొరకు ఒక సంరక్షకుణ్ణి నియమించు. మరియు నీ వద్ద నుండి మా కొరకు ఒక సహాయకుణ్ణి ఏర్పాటు చేయి!" అని వేడుకుంటున్నారు

Choose other languages: