Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #31 Translated in Telugu

وَاللَّهُ يُرِيدُ أَنْ يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَنْ تَمِيلُوا مَيْلًا عَظِيمًا
మరియు అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించ గోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు, మీరు (సన్మార్గం నుండి) చాలా దూరంగా వైదొలగాలని కోరుతున్నారు
يُرِيدُ اللَّهُ أَنْ يُخَفِّفَ عَنْكُمْ ۚ وَخُلِقَ الْإِنْسَانُ ضَعِيفًا
అల్లాహ్ మీ భారాన్ని తగ్గించగోరుతున్నాడు. మరియు (ఎందుకంటే) మానవుడు బలహీనుడిగా సృష్టించబడ్డాడు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا أَمْوَالَكُمْ بَيْنَكُمْ بِالْبَاطِلِ إِلَّا أَنْ تَكُونَ تِجَارَةً عَنْ تَرَاضٍ مِنْكُمْ ۚ وَلَا تَقْتُلُوا أَنْفُسَكُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
ఓ విశ్వాసులారా! మీరు ఒకరి సొమ్ము నొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది (లాభం) తప్ప. మరియు మీరు ఒకరి నొకరు చంపుకోకండి. నిశ్చయంగా, అల్లాహ్ మీ యెడల అపార కరుణాప్రదాత
وَمَنْ يَفْعَلْ ذَٰلِكَ عُدْوَانًا وَظُلْمًا فَسَوْفَ نُصْلِيهِ نَارًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
మరియు ఎవడు ద్వేషంతో మరియు దుర్మార్గంతో అలా చేస్తాడో, వానిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. మరియు అది అల్లాహ్ కు ఎంతో సులభం
إِنْ تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنْكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُمْ مُدْخَلًا كَرِيمًا
ఒకవేళ మీకు నిషేధించబడి నటువంటి మహాపాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవస్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము

Choose other languages: