Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #32 Translated in Telugu

يُرِيدُ اللَّهُ أَنْ يُخَفِّفَ عَنْكُمْ ۚ وَخُلِقَ الْإِنْسَانُ ضَعِيفًا
అల్లాహ్ మీ భారాన్ని తగ్గించగోరుతున్నాడు. మరియు (ఎందుకంటే) మానవుడు బలహీనుడిగా సృష్టించబడ్డాడు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا أَمْوَالَكُمْ بَيْنَكُمْ بِالْبَاطِلِ إِلَّا أَنْ تَكُونَ تِجَارَةً عَنْ تَرَاضٍ مِنْكُمْ ۚ وَلَا تَقْتُلُوا أَنْفُسَكُمْ ۚ إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
ఓ విశ్వాసులారా! మీరు ఒకరి సొమ్ము నొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది (లాభం) తప్ప. మరియు మీరు ఒకరి నొకరు చంపుకోకండి. నిశ్చయంగా, అల్లాహ్ మీ యెడల అపార కరుణాప్రదాత
وَمَنْ يَفْعَلْ ذَٰلِكَ عُدْوَانًا وَظُلْمًا فَسَوْفَ نُصْلِيهِ نَارًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
మరియు ఎవడు ద్వేషంతో మరియు దుర్మార్గంతో అలా చేస్తాడో, వానిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. మరియు అది అల్లాహ్ కు ఎంతో సులభం
إِنْ تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنْكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُمْ مُدْخَلًا كَرِيمًا
ఒకవేళ మీకు నిషేధించబడి నటువంటి మహాపాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవస్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము
وَلَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللَّهُ بِهِ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ ۚ لِلرِّجَالِ نَصِيبٌ مِمَّا اكْتَسَبُوا ۖ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِمَّا اكْتَسَبْنَ ۚ وَاسْأَلُوا اللَّهَ مِنْ فَضْلِهِ ۗ إِنَّ اللَّهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
మరియు అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై ఇచ్చిన ఘనతను మీరు ఆశించకండి. పురుషులకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు స్త్రీలకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు అల్లాహ్ అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతిదాని పరిజ్ఞానం ఉంది

Choose other languages: