Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #165 Translated in Telugu

وَإِذْ قِيلَ لَهُمُ اسْكُنُوا هَٰذِهِ الْقَرْيَةَ وَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ وَقُولُوا حِطَّةٌ وَادْخُلُوا الْبَابَ سُجَّدًا نَغْفِرْ لَكُمْ خَطِيئَاتِكُمْ ۚ سَنَزِيدُ الْمُحْسِنِينَ
మరియు వారికి ఇలా ఆజ్ఞ ఇవ్వబడిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!): ఈ నగరంలో నివసించి, అందులో మీ ఇష్టప్రకారం తినండి. మరియు : `మా పాపాలను క్షమించు (హిత్తతున్), అని అంటూ ఉండండి. మరియు సాష్టాంగ పడుతూ దాని ద్వారంలో ప్రవేశించండి, మేము మీ పాపాలను క్షమిస్తాము. మేము సజ్జనులను అధికంగా (అనుగ్రహిస్తాము)
فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِجْزًا مِنَ السَّمَاءِ بِمَا كَانُوا يَظْلِمُونَ
కాని వారిలో దుర్మార్గులైన వారు తమకు చెప్పబడిన మాటను మార్చి, మరొకు మాటను ఉచ్ఛరించారు; కావున వారు చేస్తున్న దుర్మార్గానికి ఫలితంగా మేము వారిపై ఆకాశం నుండి ఆపదను పంపాము
وَاسْأَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِي كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ إِذْ يَعْدُونَ فِي السَّبْتِ إِذْ تَأْتِيهِمْ حِيتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَيَوْمَ لَا يَسْبِتُونَ ۙ لَا تَأْتِيهِمْ ۚ كَذَٰلِكَ نَبْلُوهُمْ بِمَا كَانُوا يَفْسُقُونَ
మరియు సముద్ర తీరము నందున్న ఆ నగర (వాసులను) గురించి వారిని అడుగు; వారు శనివారపు (సబ్త్) ధర్మాన్ని ఉల్లంఘించేవారు! ఆ శనివారం (సబ్త్) రోజుననే చేపలు వారి ముందుకు ఎగిరెగిరి నీటిపైకి వచ్చేవి. మరియు శనివారపు (సబ్త్) ధర్మం పాటించని రోజు (చేపలు) వచ్చేవి కావు. వారి అవిధేయతకు కారణంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురిచేశాము
وَإِذْ قَالَتْ أُمَّةٌ مِنْهُمْ لِمَ تَعِظُونَ قَوْمًا ۙ اللَّهُ مُهْلِكُهُمْ أَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا ۖ قَالُوا مَعْذِرَةً إِلَىٰ رَبِّكُمْ وَلَعَلَّهُمْ يَتَّقُونَ
వారిలోని ఒక వర్గం వారు: అల్లాహ్ ఎవరిని నశింప జేయనున్నాడో లేదా ఎవరికి కఠినశిక్ష విధించనున్నాడో! అలాంటి వారికి, మీరెందుకు ఉపదేశం చేస్తున్నారు?" అని అంటే అతను (ఉపదేశం చేసే వ్యక్తి) అన్నాడు: మీ ప్రభువు ముందు, (హింతబోధ ఎందుకు చేయలేదని), నాపై నింద ఉండకుండా మరియు వారు దైవభీతి గల వారు అవుతారేమోనని
فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ أَنْجَيْنَا الَّذِينَ يَنْهَوْنَ عَنِ السُّوءِ وَأَخَذْنَا الَّذِينَ ظَلَمُوا بِعَذَابٍ بَئِيسٍ بِمَا كَانُوا يَفْسُقُونَ
తరువాత వారికి చేయబడిన హితబోధను వారు మరచినప్పుడు! దుష్కార్యాల నుంచి వారిస్తూ ఉన్న వారిని మేము రక్షించాము. మరియు దుర్మార్గులైన ఇతరులను, అవిధేయత చూపినందుకు కఠినశిక్షకు గురిచేశాము

Choose other languages: