Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #168 Translated in Telugu

وَإِذْ قَالَتْ أُمَّةٌ مِنْهُمْ لِمَ تَعِظُونَ قَوْمًا ۙ اللَّهُ مُهْلِكُهُمْ أَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا ۖ قَالُوا مَعْذِرَةً إِلَىٰ رَبِّكُمْ وَلَعَلَّهُمْ يَتَّقُونَ
వారిలోని ఒక వర్గం వారు: అల్లాహ్ ఎవరిని నశింప జేయనున్నాడో లేదా ఎవరికి కఠినశిక్ష విధించనున్నాడో! అలాంటి వారికి, మీరెందుకు ఉపదేశం చేస్తున్నారు?" అని అంటే అతను (ఉపదేశం చేసే వ్యక్తి) అన్నాడు: మీ ప్రభువు ముందు, (హింతబోధ ఎందుకు చేయలేదని), నాపై నింద ఉండకుండా మరియు వారు దైవభీతి గల వారు అవుతారేమోనని
فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ أَنْجَيْنَا الَّذِينَ يَنْهَوْنَ عَنِ السُّوءِ وَأَخَذْنَا الَّذِينَ ظَلَمُوا بِعَذَابٍ بَئِيسٍ بِمَا كَانُوا يَفْسُقُونَ
తరువాత వారికి చేయబడిన హితబోధను వారు మరచినప్పుడు! దుష్కార్యాల నుంచి వారిస్తూ ఉన్న వారిని మేము రక్షించాము. మరియు దుర్మార్గులైన ఇతరులను, అవిధేయత చూపినందుకు కఠినశిక్షకు గురిచేశాము
فَلَمَّا عَتَوْا عَنْ مَا نُهُوا عَنْهُ قُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ
కాని నిషేధించబడిన వాటినే వారు హద్దులు మీరి చేసినప్పుడు మేము వారితో: మీరు నీచమైన కోతులుగా మారండి." అని అన్నాము
وَإِذْ تَأَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَنْ يَسُومُهُمْ سُوءَ الْعَذَابِ ۗ إِنَّ رَبَّكَ لَسَرِيعُ الْعِقَابِ ۖ وَإِنَّهُ لَغَفُورٌ رَحِيمٌ
మరియు నీ ప్రభువు వారిపై (యూదులపై) అంతిమదినం వరకు దుఃఖకరమైన శిక్ష విధించే వారిని పంపుతూ ఉంటానని ప్రకటించిన విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకోండి). నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో శీఘ్రుడు, మరియు నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత
وَقَطَّعْنَاهُمْ فِي الْأَرْضِ أُمَمًا ۖ مِنْهُمُ الصَّالِحُونَ وَمِنْهُمْ دُونَ ذَٰلِكَ ۖ وَبَلَوْنَاهُمْ بِالْحَسَنَاتِ وَالسَّيِّئَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ
మరియు మేము వారిని భువిలో వేర్వేరు తెగలుగా జేసి వ్యాపింప జేశాము. వారిలో కొందరు సన్మార్గులున్నారు, మరి కొందరు దానికి దూరమైన వారున్నారు. బహుశా వారు (సన్మార్గానికి) మరలి వస్తారేమోనని, మేము వారిని మంచి-చెడు స్థితుల ద్వారా పరీక్షించాము

Choose other languages: