Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #154 Translated in Telugu

وَلَمَّا رَجَعَ مُوسَىٰ إِلَىٰ قَوْمِهِ غَضْبَانَ أَسِفًا قَالَ بِئْسَمَا خَلَفْتُمُونِي مِنْ بَعْدِي ۖ أَعَجِلْتُمْ أَمْرَ رَبِّكُمْ ۖ وَأَلْقَى الْأَلْوَاحَ وَأَخَذَ بِرَأْسِ أَخِيهِ يَجُرُّهُ إِلَيْهِ ۚ قَالَ ابْنَ أُمَّ إِنَّ الْقَوْمَ اسْتَضْعَفُونِي وَكَادُوا يَقْتُلُونَنِي فَلَا تُشْمِتْ بِيَ الْأَعْدَاءَ وَلَا تَجْعَلْنِي مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు: నేను వెళ్ళిన పిదప మీరు ఆచరించింది ఎంత చెడ్డది! ఏమీ? మీ ప్రభువు ఆజ్ఞ (రాకముందే) తొందరపడి (ఆయన ఆరాధనను వదిలారా)?" తరువాత ఫలకాలను పడవేసి, తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకొని తన వైపుకు లాగాడు. (హారూన్) అన్నాడు: నా సోదరుడా (తల్లి కుమారుడా!) వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే, కావున నీవు (మన) శత్రువులకు, నన్ను చూసి సంతోషించే అవకాశం ఇవ్వకు మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు
قَالَ رَبِّ اغْفِرْ لِي وَلِأَخِي وَأَدْخِلْنَا فِي رَحْمَتِكَ ۖ وَأَنْتَ أَرْحَمُ الرَّاحِمِينَ
(మూసా) అన్నాడు: ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా సోదరుణ్ణి క్షమించు. మరియు మా ఇద్దరినీ నీ కారుణ్యంలోకి చేర్చుకో. మరియు నీవే కరుణించే వారిలో అందరి కంటే అధికంగా కరుణించేవాడవు
إِنَّ الَّذِينَ اتَّخَذُوا الْعِجْلَ سَيَنَالُهُمْ غَضَبٌ مِنْ رَبِّهِمْ وَذِلَّةٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُفْتَرِينَ
ఆవుదూడను (దైవంగా) చేసుకున్న వారు తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహానికి గురి అవుతారు మరియు వారు ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. మరియు అసత్యాలు కల్పించే వారిని మేము ఇదే విధంగా శిక్షిస్తాము
وَالَّذِينَ عَمِلُوا السَّيِّئَاتِ ثُمَّ تَابُوا مِنْ بَعْدِهَا وَآمَنُوا إِنَّ رَبَّكَ مِنْ بَعْدِهَا لَغَفُورٌ رَحِيمٌ
మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప, పశ్చాత్తాపపడతారో మరియు విశ్వసిస్తారో! అలాంటి వారు నిశ్చయంగా, ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొందుతారు
وَلَمَّا سَكَتَ عَنْ مُوسَى الْغَضَبُ أَخَذَ الْأَلْوَاحَ ۖ وَفِي نُسْخَتِهَا هُدًى وَرَحْمَةٌ لِلَّذِينَ هُمْ لِرَبِّهِمْ يَرْهَبُونَ
మరియు మూసా కోపం చల్లారిని తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు. మరియు తమ ప్రభువుకు భయపడేవారికి, వాటి వ్రాతలలో మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ఉన్నాయి

Choose other languages: