Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #157 Translated in Telugu

وَالَّذِينَ عَمِلُوا السَّيِّئَاتِ ثُمَّ تَابُوا مِنْ بَعْدِهَا وَآمَنُوا إِنَّ رَبَّكَ مِنْ بَعْدِهَا لَغَفُورٌ رَحِيمٌ
మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప, పశ్చాత్తాపపడతారో మరియు విశ్వసిస్తారో! అలాంటి వారు నిశ్చయంగా, ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొందుతారు
وَلَمَّا سَكَتَ عَنْ مُوسَى الْغَضَبُ أَخَذَ الْأَلْوَاحَ ۖ وَفِي نُسْخَتِهَا هُدًى وَرَحْمَةٌ لِلَّذِينَ هُمْ لِرَبِّهِمْ يَرْهَبُونَ
మరియు మూసా కోపం చల్లారిని తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు. మరియు తమ ప్రభువుకు భయపడేవారికి, వాటి వ్రాతలలో మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ఉన్నాయి
وَاخْتَارَ مُوسَىٰ قَوْمَهُ سَبْعِينَ رَجُلًا لِمِيقَاتِنَا ۖ فَلَمَّا أَخَذَتْهُمُ الرَّجْفَةُ قَالَ رَبِّ لَوْ شِئْتَ أَهْلَكْتَهُمْ مِنْ قَبْلُ وَإِيَّايَ ۖ أَتُهْلِكُنَا بِمَا فَعَلَ السُّفَهَاءُ مِنَّا ۖ إِنْ هِيَ إِلَّا فِتْنَتُكَ تُضِلُّ بِهَا مَنْ تَشَاءُ وَتَهْدِي مَنْ تَشَاءُ ۖ أَنْتَ وَلِيُّنَا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۖ وَأَنْتَ خَيْرُ الْغَافِرِينَ
మరియు మేము నిర్ణయించిన గడువు కొరకు, మూసా తన జాతి వారిలో నుండి డెబ్బై మందిని ఎన్నుకున్నాడు. ఆ పిదప వారిని భూకంపం ఆవరించగా (మూసా) ఇలా ప్రార్థించాడు: ఓ నా ప్రభూ! నీవు కోరితే, వీరిని మరియు నన్ను కూడా ఇంతకు పూర్వమే సంహరించి ఉండేవాడవు. ఏమీ? మాలో కొందరు మూఢులు చేసిన పనికి నీవు మమ్మల్ని నశింపజేస్తావా? ఇదంతా నీ పరీక్షయే! దీని ద్వారా నీవు కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తావు మరియు నీవు కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తావు. మా సంరక్షకుడవు నీవే, కావున మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. మరియు క్షమించే వారందరిలో నీవే అత్యుత్తముడవు
وَاكْتُبْ لَنَا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ إِنَّا هُدْنَا إِلَيْكَ ۚ قَالَ عَذَابِي أُصِيبُ بِهِ مَنْ أَشَاءُ ۖ وَرَحْمَتِي وَسِعَتْ كُلَّ شَيْءٍ ۚ فَسَأَكْتُبُهَا لِلَّذِينَ يَتَّقُونَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَالَّذِينَ هُمْ بِآيَاتِنَا يُؤْمِنُونَ
మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మంచి స్థితినే వ్రాయి. నిశ్చయంగా మేము నీ వైపునకే మరలాము." (అల్లాహ్) సమాధానం ఇచ్చాడు: నేను కోరిన వారికి నా శిక్షను విధిస్తాను. నా కారుణ్యం ప్రతి దానిని ఆవరించి ఉన్నది. కనుక నేను దానిని దైవభీతి గలవారికీ, విధిదానం (జకాత్) ఇచ్చే వారికీ మరియు నా సూచనలను విశ్వసించే వారికీ వ్రాస్తాను
الَّذِينَ يَتَّبِعُونَ الرَّسُولَ النَّبِيَّ الْأُمِّيَّ الَّذِي يَجِدُونَهُ مَكْتُوبًا عِنْدَهُمْ فِي التَّوْرَاةِ وَالْإِنْجِيلِ يَأْمُرُهُمْ بِالْمَعْرُوفِ وَيَنْهَاهُمْ عَنِ الْمُنْكَرِ وَيُحِلُّ لَهُمُ الطَّيِّبَاتِ وَيُحَرِّمُ عَلَيْهِمُ الْخَبَائِثَ وَيَضَعُ عَنْهُمْ إِصْرَهُمْ وَالْأَغْلَالَ الَّتِي كَانَتْ عَلَيْهِمْ ۚ فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అతవరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు

Choose other languages: