Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #145 Translated in Telugu

الَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمْ فَإِنْ كَانَ لَكُمْ فَتْحٌ مِنَ اللَّهِ قَالُوا أَلَمْ نَكُنْ مَعَكُمْ وَإِنْ كَانَ لِلْكَافِرِينَ نَصِيبٌ قَالُوا أَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُمْ مِنَ الْمُؤْمِنِينَ ۚ فَاللَّهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلَنْ يَجْعَلَ اللَّهُ لِلْكَافِرِينَ عَلَى الْمُؤْمِنِينَ سَبِيلًا
వారు (కపట విశ్వాసులు) మీ విషయంలో నిరీక్షిస్తున్నారు. ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి విజయం లభిస్తే! వారు (మీతో) అంటారు: ఏమీ? మేము మీతో కలిసి లేమా?" కాని ఒకవేళ సత్యతిరస్కారులదే పైచేయి అయితే (వారితో) అంటారు: ఏమీ? మీతో గెలిచే శక్తి మాకు లేక పోయిందా? అయినా మేము మిమ్మల్ని విశ్వాసుల నుండి కాపాడలేదా?" కాని అల్లాహ్ పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్! ఎన్నటికీ సత్యతిరస్కారులకు విశ్వాసులపై (విజయం పొందే) మార్గం చూపడు
إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلًا
నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులు అల్లాహ్ ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు. మరియు వారు అల్లాహ్ ను స్మరించేది చాల తక్కువ
مُذَبْذَبِينَ بَيْنَ ذَٰلِكَ لَا إِلَىٰ هَٰؤُلَاءِ وَلَا إِلَىٰ هَٰؤُلَاءِ ۚ وَمَنْ يُضْلِلِ اللَّهُ فَلَنْ تَجِدَ لَهُ سَبِيلًا
వారు (విశ్వాస - అవిశ్వాసాల) మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు (విశ్వాసులు) కాకుండా, పూర్తిగా అటు (సత్యతిరస్కారులు) కాకుండా ఉన్నారు. మరియు ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడో అలాంటి వాడికి నీవు (సరైన) మార్గం చూపలేవు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا الْكَافِرِينَ أَوْلِيَاءَ مِنْ دُونِ الْمُؤْمِنِينَ ۚ أَتُرِيدُونَ أَنْ تَجْعَلُوا لِلَّهِ عَلَيْكُمْ سُلْطَانًا مُبِينًا
ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను, మీ స్నేహితులుగా చేసుకోకండి. ఏమీ? మీరు, మీకే వ్యతిరేకంగా, అల్లాహ్ కు స్పష్టమైన ప్రమాణం ఇవ్వదలచు కున్నారా
إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ وَلَنْ تَجِدَ لَهُمْ نَصِيرًا
నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో, అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు. మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు

Choose other languages: