Quran Apps in many lanuages:

Surah Al-Mumtahana Ayahs #8 Translated in Telugu

قَدْ كَانَتْ لَكُمْ أُسْوَةٌ حَسَنَةٌ فِي إِبْرَاهِيمَ وَالَّذِينَ مَعَهُ إِذْ قَالُوا لِقَوْمِهِمْ إِنَّا بُرَآءُ مِنْكُمْ وَمِمَّا تَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ كَفَرْنَا بِكُمْ وَبَدَا بَيْنَنَا وَبَيْنَكُمُ الْعَدَاوَةُ وَالْبَغْضَاءُ أَبَدًا حَتَّىٰ تُؤْمِنُوا بِاللَّهِ وَحْدَهُ إِلَّا قَوْلَ إِبْرَاهِيمَ لِأَبِيهِ لَأَسْتَغْفِرَنَّ لَكَ وَمَا أَمْلِكُ لَكَ مِنَ اللَّهِ مِنْ شَيْءٍ ۖ رَبَّنَا عَلَيْكَ تَوَكَّلْنَا وَإِلَيْكَ أَنَبْنَا وَإِلَيْكَ الْمَصِيرُ
వాస్తవానికి ఇబ్రాహీమ్ మరియు అతనితో ఉన్న వారిలో మీ కొరకు ఒక మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతి వారితో ఇలా అన్నప్పుడు: నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో, మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసించనంత వరకు, మాకూ మీకూ మధ్య విరోధం మరియు ద్వేషం ఉంటుంది." ఇక ఇబ్రాహీమ్ తన తండ్రితో: నేను తప్పక నిన్ను క్షమించమని (నా ప్రభువును) వేడుకుంటాను. ఇది తప్ప, నీ కొరకు అల్లాహ్ నుండి మరేమీ పొందే అధికారం నాకు లేదు." అని మాత్రమే అనగలిగాడు. (అల్లాహ్ తో ఇలా ప్రార్థించాడు): ఓ నా ప్రభూ! మేము నిన్నే నమ్ముకున్నాము మరియు నీ వైపునకే పశ్చాత్తాపంతో మరలుతున్నాము మరియు నీ వైపుకే మా గమ్యస్థానముంది
رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِلَّذِينَ كَفَرُوا وَاغْفِرْ لَنَا رَبَّنَا ۖ إِنَّكَ أَنْتَ الْعَزِيزُ الْحَكِيمُ
ఓ మా ప్రభూ! మమ్మల్ని సత్యతిరస్కారుల కొరకు పరీక్షా సాధనంగా చేయకు మరియు ఓ మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా కేవలం, నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేచనాపరుడవు
لَقَدْ كَانَ لَكُمْ فِيهِمْ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ ۚ وَمَنْ يَتَوَلَّ فَإِنَّ اللَّهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
వాస్తవాంగా! మీకు - అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని అపేక్షించేవారికి - వారిలో ఒక మంచి ఆదర్శం ఉంది. మరియు ఎవడైనా దీని నుండి మరలిపోతే! నిశ్చయంగా, అల్లాహ్ నిరపేక్షాపరుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు (అని తెలుసుకోవాలి)
عَسَى اللَّهُ أَنْ يَجْعَلَ بَيْنَكُمْ وَبَيْنَ الَّذِينَ عَادَيْتُمْ مِنْهُمْ مَوَدَّةً ۚ وَاللَّهُ قَدِيرٌ ۚ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ
బహుశా, అల్లాహ్ మీ మధ్య మరియు మీకు విరోధులైన వారి మధ్య ప్రేమ కలిగించవచ్చు. మరియు అల్లాహ్ (ప్రతిదీ చేయగల) సమర్ధుడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
لَا يَنْهَاكُمُ اللَّهُ عَنِ الَّذِينَ لَمْ يُقَاتِلُوكُمْ فِي الدِّينِ وَلَمْ يُخْرِجُوكُمْ مِنْ دِيَارِكُمْ أَنْ تَبَرُّوهُمْ وَتُقْسِطُوا إِلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు

Choose other languages: