Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #30 Translated in Telugu

قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ ۛ أَرْبَعِينَ سَنَةً ۛ يَتِيهُونَ فِي الْأَرْضِ ۚ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ
(అల్లాహ్) అన్నాడు: ఇక నిశ్చయంగా ఆ భూమి వారి కొరకు నలభై సంవత్సరాల వరకు నిషేధింపబడింది. వారు దేశదిమ్మరులై ఈ భూమిలో తిరుగుతూ ఉంటారు. కావున అవిధేయులైన జనులను గురించి నీవు చింతించకు
وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ قَالَ لَأَقْتُلَنَّكَ ۖ قَالَ إِنَّمَا يَتَقَبَّلُ اللَّهُ مِنَ الْمُتَّقِينَ
మరియు వారికి ఆదమ్ యొక్క ఇద్దరు కుమారుల (హాబిల్ మరియు ఖాబిల్ ల) యథార్థ కథను వినిపించు. వారిద్దరు (అల్లాహ్ కు) బలి (ఖుర్బానీ) ఇచ్చి నప్పుడు ఒకని (హాబిల్) బలి స్వీకరించ బడింది మరియు రెండవ వాని (ఖాబీల్) బలి స్వీకరించ బడలేదు. (ఖాబీల్) అన్నాడు: నిశ్చయంగా నేను నిన్ను చంపుతాను." (దానికి హాబీల్) అన్నాడు: నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారి (బలినే) స్వీకరిస్తాడు
لَئِنْ بَسَطْتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ ۖ إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ
ఒకవేళ నీవు నన్ను చంపటానికి నీ చేయి నా వైపుకు ఎత్తినా! నేను నిన్ను చంపటానికి నా చేయి నీ వైపుకు ఎత్తను. (ఎందుకంటే) నిశ్చయంగా, నేను సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కు భయపడుతున్నాను
إِنِّي أُرِيدُ أَنْ تَبُوءَ بِإِثْمِي وَإِثْمِكَ فَتَكُونَ مِنْ أَصْحَابِ النَّارِ ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ
నీవు నీ పాపంతో సహా, నా పాపాన్ని కూడా భరించి నరకవాసులలో ఒకడవు కావాలని నా కోరిక. మరియు ఇదే దుర్మార్గుల ప్రతిఫలం
فَطَوَّعَتْ لَهُ نَفْسُهُ قَتْلَ أَخِيهِ فَقَتَلَهُ فَأَصْبَحَ مِنَ الْخَاسِرِينَ
చివరికి అతడి మనస్సు అతడిని (తన సోదరుని) హత్యకు పురికొల్పింది, కావున అతడు తన సోదరుణ్ణి (హాబీల్ ను) చంపి నష్టం పొందిన వారిలో చేరి పోయాడు

Choose other languages: