Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #33 Translated in Telugu

إِنِّي أُرِيدُ أَنْ تَبُوءَ بِإِثْمِي وَإِثْمِكَ فَتَكُونَ مِنْ أَصْحَابِ النَّارِ ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ
నీవు నీ పాపంతో సహా, నా పాపాన్ని కూడా భరించి నరకవాసులలో ఒకడవు కావాలని నా కోరిక. మరియు ఇదే దుర్మార్గుల ప్రతిఫలం
فَطَوَّعَتْ لَهُ نَفْسُهُ قَتْلَ أَخِيهِ فَقَتَلَهُ فَأَصْبَحَ مِنَ الْخَاسِرِينَ
చివరికి అతడి మనస్సు అతడిని (తన సోదరుని) హత్యకు పురికొల్పింది, కావున అతడు తన సోదరుణ్ణి (హాబీల్ ను) చంపి నష్టం పొందిన వారిలో చేరి పోయాడు
فَبَعَثَ اللَّهُ غُرَابًا يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ أَخِيهِ ۚ قَالَ يَا وَيْلَتَا أَعَجَزْتُ أَنْ أَكُونَ مِثْلَ هَٰذَا الْغُرَابِ فَأُوَارِيَ سَوْءَةَ أَخِي ۖ فَأَصْبَحَ مِنَ النَّادِمِينَ
అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపాడు; అది నేలను త్రవ్వి అతని సోదరుని శవాన్ని ఎలా దాచాలో చూపించింది. అతడు (ఖాబీల్) : అయ్యో, నా పాడుగాను! నేను ఈ కాకి పాటి వాణ్ణి కూడా కాలేక పోయాను! నా సోదరుని శవాన్ని దాచే (ఉపాయం) వెతక లేక పోయాను కదా!" అని వాపోయాడు. అప్పుడతడు పశ్చాత్తాప పడే వారిలో చేరి పోయాడు
مِنْ أَجْلِ ذَٰلِكَ كَتَبْنَا عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنَّهُ مَنْ قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُنَا بِالْبَيِّنَاتِ ثُمَّ إِنَّ كَثِيرًا مِنْهُمْ بَعْدَ ذَٰلِكَ فِي الْأَرْضِ لَمُسْرِفُونَ
ఈ కారుణం వల్లనే మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఈ ఉత్తరువు ఇచ్చాము: నిశ్చయంగా - ఒక వ్యక్తి (హత్యకు) బదులుగా గానీ లేదా భూమిలో కల్లోలం వ్యాపింపజేసి నందుకు గానీ గాక - ఎవడైనా ఒక వ్యక్తిని (అన్యాయంగా) చంపితే, అతడు సర్వ మానవజాతిని చంపినట్లే, మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే, అతడు సర్వ మానవజాతి ప్రాణాలను కాపాడినట్లే!" మరియు వాస్తవానికి, వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మా ప్రవక్తలు వచ్చారు, అయినా వాస్తవానికి వారిలో పలువురు భూమిలో అక్రమాలు చేసేవారు
إِنَّمَا جَزَاءُ الَّذِينَ يُحَارِبُونَ اللَّهَ وَرَسُولَهُ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا أَنْ يُقَتَّلُوا أَوْ يُصَلَّبُوا أَوْ تُقَطَّعَ أَيْدِيهِمْ وَأَرْجُلُهُمْ مِنْ خِلَافٍ أَوْ يُنْفَوْا مِنَ الْأَرْضِ ۚ ذَٰلِكَ لَهُمْ خِزْيٌ فِي الدُّنْيَا ۖ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ
నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో మరియు ధరణిలో కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి మరణ శిక్ష విధించాలి; లేదా శిలువపై ఎక్కించాలి; లేదా వారి అభిముఖ పక్షాల కాళ్ళు - చేతులను నరికించాలి; లేదా వారిని దేశ బహిష్క్రుతుల్ని చేయాలి. ఇది వారికి ఇహలోకంలో గల అవమానం. మరియు వారికి పరలోకంలో కూడా ఘోర శిక్ష ఉంటుంది

Choose other languages: