Quran Apps in many lanuages:

Surah Al-Fath Ayahs #15 Translated in Telugu

سَيَقُولُ لَكَ الْمُخَلَّفُونَ مِنَ الْأَعْرَابِ شَغَلَتْنَا أَمْوَالُنَا وَأَهْلُونَا فَاسْتَغْفِرْ لَنَا ۚ يَقُولُونَ بِأَلْسِنَتِهِمْ مَا لَيْسَ فِي قُلُوبِهِمْ ۚ قُلْ فَمَنْ يَمْلِكُ لَكُمْ مِنَ اللَّهِ شَيْئًا إِنْ أَرَادَ بِكُمْ ضَرًّا أَوْ أَرَادَ بِكُمْ نَفْعًا ۚ بَلْ كَانَ اللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
వెనుక ఉండిపోయిన ఎడారి వాసులు (బద్దూలు) నీతో ఇలా అంటారు: మా ఆస్తిపాస్తుల మరియు మా ఆలుబిడ్డల చింత మాకు తీరిక లేకుండా చేశాయి. కావున మా క్షమాపణకై ప్రార్థించండి!" వారు తమ హృదయాలలో లేనిది తమ నాలుకలతో పలుకుతున్నారు. వారితో ఇలా అను: ఒకవేళ అల్లాహ్ మీకు నష్టం చేయదలిస్తే, లేదా లాభం చేయదలిస్తే, ఆయన నుండి మిమ్మల్ని తప్పించగల శక్తి ఎవరికుంది? వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును
بَلْ ظَنَنْتُمْ أَنْ لَنْ يَنْقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنْتُمْ ظَنَّ السَّوْءِ وَكُنْتُمْ قَوْمًا بُورًا
అలా కాదు! ప్రవక్త మరియు విశ్వాసులు ఎన్నటికీ - తమ ఆలుబిడ్డల వద్దకు - తిరిగి రాలేరని మీరు భావించారు; మరియు ఇది (ఈ ఆలోచన) మీ హృదయాలకు చాలా నచ్చింది మరియు మీరు చాలా చెడ్డ తలంపులు చేశారు మరియు మీరు అధోగతికి చెందినవారు
وَمَنْ لَمْ يُؤْمِنْ بِاللَّهِ وَرَسُولِهِ فَإِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَعِيرًا
మరియు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించని సత్యతిరస్కారుల కొరకు మేము నిశ్చయంగా, భగభగ మండే అగ్ని జ్వాలలను సిద్ధపరచి ఉంచాము
وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ يَغْفِرُ لِمَنْ يَشَاءُ وَيُعَذِّبُ مَنْ يَشَاءُ ۚ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا
మరియు భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ దే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ సదా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత
سَيَقُولُ الْمُخَلَّفُونَ إِذَا انْطَلَقْتُمْ إِلَىٰ مَغَانِمَ لِتَأْخُذُوهَا ذَرُونَا نَتَّبِعْكُمْ ۖ يُرِيدُونَ أَنْ يُبَدِّلُوا كَلَامَ اللَّهِ ۚ قُلْ لَنْ تَتَّبِعُونَا كَذَٰلِكُمْ قَالَ اللَّهُ مِنْ قَبْلُ ۖ فَسَيَقُولُونَ بَلْ تَحْسُدُونَنَا ۚ بَلْ كَانُوا لَا يَفْقَهُونَ إِلَّا قَلِيلًا
ఇక మీరు మీ విజయధనాన్ని తీసుకోవటానికి పోయినప్పుడు, వెనుక ఉండి పోయిన వారు ఇలా అంటారు: మమ్మల్ని కూడా మీ వెంట రానివ్వండి." వారు అల్లాహ్ ఉత్తరువును మార్చగోరుతున్నారు. వారితో అను: మీరు మా వెంట రాజాలరు; మీ గురించి అల్లాహ్ ముందే ఈ విధంగా చెప్పాడు." అప్పుడు వారు ఇలా అంటారు: అది కాదు! మీరు మా మీద అసూయ పడుతున్నారు." అలా కాదు! వారు వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగేది చాలా తక్కువ

Choose other languages: