Quran Apps in many lanuages:

Surah Al-Fath Ayahs #14 Translated in Telugu

إِنَّ الَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ اللَّهَ يَدُ اللَّهِ فَوْقَ أَيْدِيهِمْ ۚ فَمَنْ نَكَثَ فَإِنَّمَا يَنْكُثُ عَلَىٰ نَفْسِهِ ۖ وَمَنْ أَوْفَىٰ بِمَا عَاهَدَ عَلَيْهُ اللَّهَ فَسَيُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, (నీ చేతిలో చేయి వేసి) నీతో శపథం చేసేవారు, వాస్తవానికి అల్లాహ్ తో శపథం చేస్తున్నారు. అల్లాహ్ చెయ్యి వారి చేతుల మీద ఉంది. ఇక ఎవడు (తన శపథాన్ని) భంగం చేస్తాడో, వాస్తవానికి అతడు తన నష్టం కొరకే తన శపథాన్ని భంగం చేస్తాడు. మరియు ఎవడు తన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడో, అల్లాహ్ అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు
سَيَقُولُ لَكَ الْمُخَلَّفُونَ مِنَ الْأَعْرَابِ شَغَلَتْنَا أَمْوَالُنَا وَأَهْلُونَا فَاسْتَغْفِرْ لَنَا ۚ يَقُولُونَ بِأَلْسِنَتِهِمْ مَا لَيْسَ فِي قُلُوبِهِمْ ۚ قُلْ فَمَنْ يَمْلِكُ لَكُمْ مِنَ اللَّهِ شَيْئًا إِنْ أَرَادَ بِكُمْ ضَرًّا أَوْ أَرَادَ بِكُمْ نَفْعًا ۚ بَلْ كَانَ اللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
వెనుక ఉండిపోయిన ఎడారి వాసులు (బద్దూలు) నీతో ఇలా అంటారు: మా ఆస్తిపాస్తుల మరియు మా ఆలుబిడ్డల చింత మాకు తీరిక లేకుండా చేశాయి. కావున మా క్షమాపణకై ప్రార్థించండి!" వారు తమ హృదయాలలో లేనిది తమ నాలుకలతో పలుకుతున్నారు. వారితో ఇలా అను: ఒకవేళ అల్లాహ్ మీకు నష్టం చేయదలిస్తే, లేదా లాభం చేయదలిస్తే, ఆయన నుండి మిమ్మల్ని తప్పించగల శక్తి ఎవరికుంది? వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును
بَلْ ظَنَنْتُمْ أَنْ لَنْ يَنْقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنْتُمْ ظَنَّ السَّوْءِ وَكُنْتُمْ قَوْمًا بُورًا
అలా కాదు! ప్రవక్త మరియు విశ్వాసులు ఎన్నటికీ - తమ ఆలుబిడ్డల వద్దకు - తిరిగి రాలేరని మీరు భావించారు; మరియు ఇది (ఈ ఆలోచన) మీ హృదయాలకు చాలా నచ్చింది మరియు మీరు చాలా చెడ్డ తలంపులు చేశారు మరియు మీరు అధోగతికి చెందినవారు
وَمَنْ لَمْ يُؤْمِنْ بِاللَّهِ وَرَسُولِهِ فَإِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَعِيرًا
మరియు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించని సత్యతిరస్కారుల కొరకు మేము నిశ్చయంగా, భగభగ మండే అగ్ని జ్వాలలను సిద్ధపరచి ఉంచాము
وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ يَغْفِرُ لِمَنْ يَشَاءُ وَيُعَذِّبُ مَنْ يَشَاءُ ۚ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا
మరియు భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ దే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ సదా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

Choose other languages: