Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #205 Translated in Telugu

وَمِنْهُمْ مَنْ يَقُولُ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
వారిలో మరికొందరు: ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు!" అని ప్రార్థిస్తారు
أُولَٰئِكَ لَهُمْ نَصِيبٌ مِمَّا كَسَبُوا ۚ وَاللَّهُ سَرِيعُ الْحِسَابِ
అలాంటి వారు తమ సంపాదనకు అనుగుణంగా (ఉభయ లోకాలలో) తమ వాటాను పొందుతారు. మరియు అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు
وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ ۚ فَمَنْ تَعَجَّلَ فِي يَوْمَيْنِ فَلَا إِثْمَ عَلَيْهِ وَمَنْ تَأَخَّرَ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ لِمَنِ اتَّقَىٰ ۗ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّكُمْ إِلَيْهِ تُحْشَرُونَ
మరియు నియమిత రోజులలో అల్లాహ్ ను స్మరించండి. ఎవడైనా త్వరగా రెండు రోజులలోనే వెళ్ళిపోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు. మరెవడైనా నిదానించి (పదమూడవ తేదీ వరకు) నిలిచి పోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు, వాడికి, ఎవడైతే దైవభీతి కలిగి ఉంటాడో! మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా మీరంతా ఆయన సన్నిధిలో హాజరు చేయబడుతారనేది తెలుసుకోండి
وَمِنَ النَّاسِ مَنْ يُعْجِبُكَ قَوْلُهُ فِي الْحَيَاةِ الدُّنْيَا وَيُشْهِدُ اللَّهَ عَلَىٰ مَا فِي قَلْبِهِ وَهُوَ أَلَدُّ الْخِصَامِ
మరియు ప్రజలలో నుండి ఒక వ్యక్తి మాటలు ఇహలోక జీవితంలో నీకు సంతోషం కలుగజేయవచ్చు; మరియు తన సంకల్పశుద్ధిని తెలుపడానికి అతడు అల్లాహ్ ను సాక్షిగా నిలబెట్టవచ్చు! కాని, వాస్తవానికి అతడు ఘోరమైన జగడాలమారి కావచ్చు
وَإِذَا تَوَلَّىٰ سَعَىٰ فِي الْأَرْضِ لِيُفْسِدَ فِيهَا وَيُهْلِكَ الْحَرْثَ وَالنَّسْلَ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الْفَسَادَ
మరియు (ఓ ముహమ్మద్) అతడు (నీ వద్ద నుండి) తిరిగిపోయి లోకంలో కల్లోలం రేకెత్తించటానికి, పంటపొలాలను మరియు పశువులను నాశనం చేయటానికి పాటుపడ వచ్చు. మరియు అల్లాహ్ కల్లోల్లాన్ని ఏ మాత్రం ప్రేమించడు

Choose other languages: