Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #142 Translated in Telugu

صِبْغَةَ اللَّهِ ۖ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّهِ صِبْغَةً ۖ وَنَحْنُ لَهُ عَابِدُونَ
(వారితో ఇలా అను): (మీరు) అల్లాహ్ రంగును (ధర్మాన్ని) స్వీకరించండి. మరియు అల్లాహ్ కంటే మంచి రంగు (ధర్మం) ఎవరిది? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించేవారము
قُلْ أَتُحَاجُّونَنَا فِي اللَّهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ وَلَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ وَنَحْنُ لَهُ مُخْلِصُونَ
(ఓ ముహమ్మద్!) వారితో అను: ఏమీ? అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదిస్తారా? (వాస్తవానికి) ఆయన మా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. మా కర్మలు మాకు మరియు మీ కర్మలు మీకు. మరియు మేము ఆయనకు మాత్రమే మనఃపూర్వకంగా విధేయుల మయ్యాము
أَمْ تَقُولُونَ إِنَّ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطَ كَانُوا هُودًا أَوْ نَصَارَىٰ ۗ قُلْ أَأَنْتُمْ أَعْلَمُ أَمِ اللَّهُ ۗ وَمَنْ أَظْلَمُ مِمَّنْ كَتَمَ شَهَادَةً عِنْدَهُ مِنَ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
లేక మీరు: నిశ్చయంగా ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ మరియు వారి సంతతి వారంతా యూదులు మరియు క్రైస్తవులు." అని అంటారా? ఇంకా ఇలా అను: ఏమీ మీకు బాగా తెలుసా? లేక అల్లాహ్ కు (బాగా తెలుసా)? అల్లాహ్ వద్ద నుండి తన వద్దకు వచ్చిన సాక్ష్యాన్ని దాచే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? మరియు మీ కర్మల నుండి, అల్లాహ్ నిర్లక్ష్యంగా లేడు
تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ
ఇప్పుడు ఆ సంఘం గతించి పోయింది. అది చేసింది దానికి మరియు మీరు చేసింది మీకు. వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్నించబడరు
سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَّاهُمْ عَنْ قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا ۚ قُلْ لِلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ يَهْدِي مَنْ يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ
ప్రజలలోని కొందరు మూఢజనులు ఇలా అంటారు: వీరిని (ముస్లింలను) ఇంత వరకు వీరు అనుసరిస్తూ వచ్చిన, ఖిబ్లా నుండి త్రిప్పింది ఏమిటి?" వారితో ఇలా అను: తూర్పు మరియు పడమరలు అల్లాహ్ కే చెందినవి. ఆయన తాను కోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు

Choose other languages: