Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #144 Translated in Telugu

أَمْ تَقُولُونَ إِنَّ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطَ كَانُوا هُودًا أَوْ نَصَارَىٰ ۗ قُلْ أَأَنْتُمْ أَعْلَمُ أَمِ اللَّهُ ۗ وَمَنْ أَظْلَمُ مِمَّنْ كَتَمَ شَهَادَةً عِنْدَهُ مِنَ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
లేక మీరు: నిశ్చయంగా ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ మరియు వారి సంతతి వారంతా యూదులు మరియు క్రైస్తవులు." అని అంటారా? ఇంకా ఇలా అను: ఏమీ మీకు బాగా తెలుసా? లేక అల్లాహ్ కు (బాగా తెలుసా)? అల్లాహ్ వద్ద నుండి తన వద్దకు వచ్చిన సాక్ష్యాన్ని దాచే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? మరియు మీ కర్మల నుండి, అల్లాహ్ నిర్లక్ష్యంగా లేడు
تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ
ఇప్పుడు ఆ సంఘం గతించి పోయింది. అది చేసింది దానికి మరియు మీరు చేసింది మీకు. వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్నించబడరు
سَيَقُولُ السُّفَهَاءُ مِنَ النَّاسِ مَا وَلَّاهُمْ عَنْ قِبْلَتِهِمُ الَّتِي كَانُوا عَلَيْهَا ۚ قُلْ لِلَّهِ الْمَشْرِقُ وَالْمَغْرِبُ ۚ يَهْدِي مَنْ يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ
ప్రజలలోని కొందరు మూఢజనులు ఇలా అంటారు: వీరిని (ముస్లింలను) ఇంత వరకు వీరు అనుసరిస్తూ వచ్చిన, ఖిబ్లా నుండి త్రిప్పింది ఏమిటి?" వారితో ఇలా అను: తూర్పు మరియు పడమరలు అల్లాహ్ కే చెందినవి. ఆయన తాను కోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు
وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا ۗ وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِي كُنْتَ عَلَيْهَا إِلَّا لِنَعْلَمَ مَنْ يَتَّبِعُ الرَّسُولَ مِمَّنْ يَنْقَلِبُ عَلَىٰ عَقِبَيْهِ ۚ وَإِنْ كَانَتْ لَكَبِيرَةً إِلَّا عَلَى الَّذِينَ هَدَى اللَّهُ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُضِيعَ إِيمَانَكُمْ ۚ إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَحِيمٌ
మరియు మీరు ప్రజలకు సాక్షులుగా ఉండటానికి మరియు సందేశహరుడు (ముహమ్మద్) మీకు సాక్షిగా ఉండటానికి" మేము, మిమ్మల్ని ఒక మధ్యస్థ (ఉత్తమ మరియు న్యాయశీలమైన) సమాజంగా చేశాము. మరియు ఎవరు సందేశహరుణ్ణి అనుసరిస్తారో మరియు ఎవరు తమ మడమల మీద వెనుదిరిగి పోతారో అనేది పరిశీలించడానికి నీవు పూర్వం అనుసరించే ఖిబ్లా (బైతుల్ మఖ్దిస్) ను ఖిబ్లాగా చేసి ఉన్నాము. మరియు ఇది వాస్తవానికి అల్లాహ్ మార్గదర్శకత్వం చూపిన వారికి తప్ప, ఇతరులకు భారమైనది. మరియు అల్లాహ్ మీ విశ్వాసాన్ని (బైతుల్ మఖ్దిస్ వైపునకు చేసిన నమాజులను) ఎన్నడూ వృథా చేయడు." నిశ్చయంగా, అల్లాహ్ ప్రజల పట్ల కనికరుడు, అపార కరుణాప్రదాత
قَدْ نَرَىٰ تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ ۖ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا ۚ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَحَيْثُ مَا كُنْتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ ۗ وَإِنَّ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِنْ رَبِّهِمْ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ
(ఓ ప్రవక్తా!) వాస్తవానికి మేము, నీవు పలుమార్లు నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తడం చూశాము. కావున మేము నిన్ను, నీవు కోరిన ఖిబ్లా వైపునకు త్రిప్పుతున్నాము. కావున నీవు మస్జద్ అల్ హరామ్ వైపునకు నీ ముఖాన్ని త్రిప్పుకో! ఇకపై మీరంతా ఎక్కడ ఉన్నా సరే (నమాజు చేసేటప్పుడు), మీ ముఖాలను ఆ వైపునకే త్రిప్పుకోండి. మరియు నిశ్చయంగా, గ్రంథం గలవారికి ఇది తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని బాగా తెలుసు. మరియు అల్లాహ్ వారి కర్మల గురించి నిర్లక్ష్యంగా లేడు

Choose other languages: