Quran Apps in many lanuages:

Surah Al-Ankabut Ayahs #37 Translated in Telugu

وَلَمَّا أَنْ جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالُوا لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا امْرَأَتَكَ كَانَتْ مِنَ الْغَابِرِينَ
ఆ తరువాత మా దూతలు లూత్ వద్దకు రాగా అతను వారి నిమిత్తం చాలా చింతించాడు. మరియు ఇబ్బందిలో పడి పోయాడు. వారిలా అన్నారు: నీవు భయపడకు మరియు దుఃఖ పడకు! నిశ్చయంగా, మేము నిన్ను మరియు నీ కుటుంబం వారిని రక్షిస్తాము - నీ భార్య తప్ప - ఆమె వెనుక ఉండి పోయేవారిలో చేరిపోయింది
إِنَّا مُنْزِلُونَ عَلَىٰ أَهْلِ هَٰذِهِ الْقَرْيَةِ رِجْزًا مِنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ
నిశ్చయంగా, మేము ఈ నగరవాసుల మీద ఆకాశం నుండి ఘోర విపత్తు అవతరింపజేయ బోతున్నాము. ఎందుకంటే వారు అవిధేయులయ్యారు
وَلَقَدْ تَرَكْنَا مِنْهَا آيَةً بَيِّنَةً لِقَوْمٍ يَعْقِلُونَ
మరియు వాస్తవానికి, బుద్ధిమంతుల కొరకు మేము దీని ద్వారా ఒక స్పష్టమైన సూచనను వదలి పెట్టాము
وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ وَارْجُوا الْيَوْمَ الْآخِرَ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
మరియు మేము మద్ యన్ వాసుల వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను పంపాము. అతను ఇలా అన్నాడు: నా జాతి ప్రజలారా! కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. మరియు అంతిమ దినం కొరకు నిరీక్షిస్తూ (భయపడుతూ) ఉండండి. మరియు దౌర్జన్యపరులుగా భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ తిరగకండి
فَكَذَّبُوهُ فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ
కాని వారు అతనిని అసత్యుడని తిరస్కరించారు, ఒక తీవ్రమైన భూకంపం వారిని పట్టుకున్నది, అప్పుడు వారు తమ ఇండ్లలోనే చలనం లేని శవాలుగా మారి పోయారు

Choose other languages: