Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #35 Translated in Telugu

قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّهِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوا يَا حَسْرَتَنَا عَلَىٰ مَا فَرَّطْنَا فِيهَا وَهُمْ يَحْمِلُونَ أَوْزَارَهُمْ عَلَىٰ ظُهُورِهِمْ ۚ أَلَا سَاءَ مَا يَزِرُونَ
వాస్తవంగా అల్లాహ్ ను కలుసుకోవటాన్ని అబద్ధంగా పరిగణించే వారే నష్టానికి గురి అయిన వారు! చివరకు ఆకస్మాత్తుగా అంతి ఘడియ వారి పైకి వచ్చినపుడు వారు: అయ్యే మా దౌర్భాగ్యం! దీని విషయంలో మేమెంత అశ్రద్ధ వహించాము కదా! అని వాపోతారు. (ఎందుకంటే) వారు తమ (పాపాల) బరువును తమ వీపులపై మోసుకొని ఉంటారు. అయ్యే! వారు మోసే భారం ఎంత దుర్భరమైనది కదా
وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَعِبٌ وَلَهْوٌ ۖ وَلَلدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ
మరియు ఇహలోక జీవితం ఒక ఆట మరియు ఒక కాలక్షేపము మాత్రమే! మరియు దైవభీతి గల వారికి పరలోక వాసమే అత్యంత శ్రేష్ఠమైనది. ఏమీ? మీరు అర్థం చేసుకోలేరా
قَدْ نَعْلَمُ إِنَّهُ لَيَحْزُنُكَ الَّذِي يَقُولُونَ ۖ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلَٰكِنَّ الظَّالِمِينَ بِآيَاتِ اللَّهِ يَجْحَدُونَ
(ఓ ప్రవక్తా!) వాస్తవానికి వారు పలుకుతున్న మాటల వలన నీకు దుఃఖము కలుగుతున్నదని మాకు బాగా తెలుసు. కానీ, నిశ్చయంగా, వారు అసత్యుడవని తిరస్కరించేది నిన్ను కాదు! వాస్తవానికి ఆ దుర్మార్గులు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తున్నారు
وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِنْ قَبْلِكَ فَصَبَرُوا عَلَىٰ مَا كُذِّبُوا وَأُوذُوا حَتَّىٰ أَتَاهُمْ نَصْرُنَا ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمَاتِ اللَّهِ ۚ وَلَقَدْ جَاءَكَ مِنْ نَبَإِ الْمُرْسَلِينَ
మరియు వాస్తవంగా, నీకు పూర్వం చాలా మంది ప్రవక్తలు, అసత్యవాదులని తిరస్కరించబడ్డారు. కాని వారు ఆ తిరస్కారాన్ని మరియు తమకు కలిగిన హింసలను, వారికి మా సహాయం అందే వరకూ సహనం వహించారు. మరియు అల్లాహ్ మాటలను ఎవ్వరూ మార్చలేరు. మరియు వాస్తవానికి, పూర్వపు ప్రవక్తల కొన్ని సమాచారాలు ఇది వరకే నీకు అందాయి
وَإِنْ كَانَ كَبُرَ عَلَيْكَ إِعْرَاضُهُمْ فَإِنِ اسْتَطَعْتَ أَنْ تَبْتَغِيَ نَفَقًا فِي الْأَرْضِ أَوْ سُلَّمًا فِي السَّمَاءِ فَتَأْتِيَهُمْ بِآيَةٍ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدَىٰ ۚ فَلَا تَكُونَنَّ مِنَ الْجَاهِلِينَ
మరియు (ఓ ముహమ్మద్!) వారి విముఖత నీకు భరించనిదైతే నీలో శక్తి ఉంటే, భూమిలో ఒక సొరంగం వెదకి, లేదా ఆకాశంలో ఒక నిచ్చెన వేసి, వారి కొరకు ఏదైనా అద్భుత సూచన తీసుకురా! మరియు అల్లాహ్ కోరితే వారందరినీ సన్మార్గం వైపునకు తెచ్చి ఉండేవాడు! కావున నీవు అజ్ఞానులలో చేరకు

Choose other languages: