Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #37 Translated in Telugu

قَدْ نَعْلَمُ إِنَّهُ لَيَحْزُنُكَ الَّذِي يَقُولُونَ ۖ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلَٰكِنَّ الظَّالِمِينَ بِآيَاتِ اللَّهِ يَجْحَدُونَ
(ఓ ప్రవక్తా!) వాస్తవానికి వారు పలుకుతున్న మాటల వలన నీకు దుఃఖము కలుగుతున్నదని మాకు బాగా తెలుసు. కానీ, నిశ్చయంగా, వారు అసత్యుడవని తిరస్కరించేది నిన్ను కాదు! వాస్తవానికి ఆ దుర్మార్గులు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తున్నారు
وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِنْ قَبْلِكَ فَصَبَرُوا عَلَىٰ مَا كُذِّبُوا وَأُوذُوا حَتَّىٰ أَتَاهُمْ نَصْرُنَا ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمَاتِ اللَّهِ ۚ وَلَقَدْ جَاءَكَ مِنْ نَبَإِ الْمُرْسَلِينَ
మరియు వాస్తవంగా, నీకు పూర్వం చాలా మంది ప్రవక్తలు, అసత్యవాదులని తిరస్కరించబడ్డారు. కాని వారు ఆ తిరస్కారాన్ని మరియు తమకు కలిగిన హింసలను, వారికి మా సహాయం అందే వరకూ సహనం వహించారు. మరియు అల్లాహ్ మాటలను ఎవ్వరూ మార్చలేరు. మరియు వాస్తవానికి, పూర్వపు ప్రవక్తల కొన్ని సమాచారాలు ఇది వరకే నీకు అందాయి
وَإِنْ كَانَ كَبُرَ عَلَيْكَ إِعْرَاضُهُمْ فَإِنِ اسْتَطَعْتَ أَنْ تَبْتَغِيَ نَفَقًا فِي الْأَرْضِ أَوْ سُلَّمًا فِي السَّمَاءِ فَتَأْتِيَهُمْ بِآيَةٍ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدَىٰ ۚ فَلَا تَكُونَنَّ مِنَ الْجَاهِلِينَ
మరియు (ఓ ముహమ్మద్!) వారి విముఖత నీకు భరించనిదైతే నీలో శక్తి ఉంటే, భూమిలో ఒక సొరంగం వెదకి, లేదా ఆకాశంలో ఒక నిచ్చెన వేసి, వారి కొరకు ఏదైనా అద్భుత సూచన తీసుకురా! మరియు అల్లాహ్ కోరితే వారందరినీ సన్మార్గం వైపునకు తెచ్చి ఉండేవాడు! కావున నీవు అజ్ఞానులలో చేరకు
إِنَّمَا يَسْتَجِيبُ الَّذِينَ يَسْمَعُونَ ۘ وَالْمَوْتَىٰ يَبْعَثُهُمُ اللَّهُ ثُمَّ إِلَيْهِ يُرْجَعُونَ
నిశ్చయంగా, ఎవరైతే (శ్రద్ధతో) వింటారో, వారే (సత్యసందేశాన్ని) స్వీకరిస్తారు. ఇక మృతులు (సత్యతిరస్కారులు) - అల్లాహ్ వారిని పునరుత్థరింప జేసినప్పుడు - (ప్రతిఫలం కొరకు) ఆయన వద్దకే రప్పింపబడతారు
وَقَالُوا لَوْلَا نُزِّلَ عَلَيْهِ آيَةٌ مِنْ رَبِّهِ ۚ قُلْ إِنَّ اللَّهَ قَادِرٌ عَلَىٰ أَنْ يُنَزِّلَ آيَةً وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
మరియు వారు: ఇతనిపై (ప్రవక్తపై) ఇతని ప్రభువు తరఫు నుండి ఏదైనా అద్భుత సూచన ఎందుకు అవతరింప జేయబడలేదు?" అని అంటారు. ఇలా అను: నిశ్చయంగా, అల్లాహ్! ఎలాంటి అద్భుత సూచననైనా అవతరింప జేయగల శక్తి కలిగి ఉన్నాడు, కాని వారిలో అనేకులకు ఇది తెలియదు

Choose other languages: