Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #133 Translated in Telugu

وَكَذَٰلِكَ نُوَلِّي بَعْضَ الظَّالِمِينَ بَعْضًا بِمَا كَانُوا يَكْسِبُونَ
ఈ విధంగా మేము దుర్మార్గులను - వారు అర్జించిన దానికి ఫలితంగా - పరస్పరం స్నేహితులు (అవులియా) గా ఉంచుతాము
يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنْسِ أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِنْكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي وَيُنْذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا ۚ قَالُوا شَهِدْنَا عَلَىٰ أَنْفُسِنَا ۖ وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا وَشَهِدُوا عَلَىٰ أَنْفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ
ఓ జిన్నాతుల మరియు మానవుల వంశీయులారా! ఏమీ? నా సూచనలను మీకు వినిపించి, మీరు (నన్ను) కలుసుకునే ఈ దినమును గురించి హెచ్చరించే ప్రవక్తలు మీలో నుంచే మీ వద్దకు రాలేదా?"(అని అల్లాహ్ వారిని అడుగుతాడు). దానికి వారు: (వచ్చారని!) మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్షులం." అని జవాబిస్తారు. మరియు వారిని ఈ ప్రాపంచిక జీవితం మోసపుచ్చింది. మరియు వారు వాస్తవానికి సత్యతిరస్కారులుగా ఉండేవారిని స్వయంగా తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిస్తారు
ذَٰلِكَ أَنْ لَمْ يَكُنْ رَبُّكَ مُهْلِكَ الْقُرَىٰ بِظُلْمٍ وَأَهْلُهَا غَافِلُونَ
ఇదంతా ఎందుకంటే! నీ ప్రభువు నగరాలను - వాటిలోని ప్రజలు సత్యాన్ని ఎరుగకుండా ఉన్నప్పుడు - అన్యాయంగా నాశనంగా చేయడు
وَلِكُلٍّ دَرَجَاتٌ مِمَّا عَمِلُوا ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ
మరియు ప్రతి ఒక్కరికీ వారి కర్మల ప్రకారం స్థానాలు ఉంటాయి. మరియు నీ ప్రభువు వారి కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు
وَرَبُّكَ الْغَنِيُّ ذُو الرَّحْمَةِ ۚ إِنْ يَشَأْ يُذْهِبْكُمْ وَيَسْتَخْلِفْ مِنْ بَعْدِكُمْ مَا يَشَاءُ كَمَا أَنْشَأَكُمْ مِنْ ذُرِّيَّةِ قَوْمٍ آخَرِينَ
మరియు నీ ప్రభువు స్వయం సమృద్ధుడు, కరుణించే స్వభావం గలవాడు. ఆయన కోరితే, ఇతర జాతి వారి తరువాత మిమ్మల్ని పుట్టించినట్లు, మిమ్మల్ని తొలగించి మీకు బదులుగా మీ తర్వాత తాను కోరిన వారిని పుట్టించగలడు

Choose other languages: