Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #136 Translated in Telugu

وَلِكُلٍّ دَرَجَاتٌ مِمَّا عَمِلُوا ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ
మరియు ప్రతి ఒక్కరికీ వారి కర్మల ప్రకారం స్థానాలు ఉంటాయి. మరియు నీ ప్రభువు వారి కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు
وَرَبُّكَ الْغَنِيُّ ذُو الرَّحْمَةِ ۚ إِنْ يَشَأْ يُذْهِبْكُمْ وَيَسْتَخْلِفْ مِنْ بَعْدِكُمْ مَا يَشَاءُ كَمَا أَنْشَأَكُمْ مِنْ ذُرِّيَّةِ قَوْمٍ آخَرِينَ
మరియు నీ ప్రభువు స్వయం సమృద్ధుడు, కరుణించే స్వభావం గలవాడు. ఆయన కోరితే, ఇతర జాతి వారి తరువాత మిమ్మల్ని పుట్టించినట్లు, మిమ్మల్ని తొలగించి మీకు బదులుగా మీ తర్వాత తాను కోరిన వారిని పుట్టించగలడు
إِنَّ مَا تُوعَدُونَ لَآتٍ ۖ وَمَا أَنْتُمْ بِمُعْجِزِينَ
మీకు చేయబడిన వాగ్దానం తప్పక పూర్తయి తీరుతుంది. మీరు దాని (శిక్ష) నుండి తప్పించుకోలేరు
قُلْ يَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ مَنْ تَكُونُ لَهُ عَاقِبَةُ الدَّارِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
ఇలా అను: ఓ నా జాతి (విశ్వసించని) ప్రజలారా! మీరు (సరి అనుకున్నది) మీ శక్తి మేరకు చేయండి. మరియు నిశ్చయంగా (నేను సరి అనుకున్నది) నేనూ చేస్తాను. ఎవరి పరిణామం సఫలీకృతం కాగలదో! మీరు త్వరలోనే తెలుసుకుంటారు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందరు
وَجَعَلُوا لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ الْحَرْثِ وَالْأَنْعَامِ نَصِيبًا فَقَالُوا هَٰذَا لِلَّهِ بِزَعْمِهِمْ وَهَٰذَا لِشُرَكَائِنَا ۖ فَمَا كَانَ لِشُرَكَائِهِمْ فَلَا يَصِلُ إِلَى اللَّهِ ۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَائِهِمْ ۗ سَاءَ مَا يَحْكُمُونَ
మరియు ఆయన (అల్లాహ్) పుట్టించిన పంటల నుండి మరియు పశువుల నుండి, వారు అల్లాహ్ కొరకు కొంత భాగాన్ని నియమించి: ఇది అల్లాహ్ కొరకు మరియు ఇది మా దేవతల (అల్లాహ్ కు వారు సాటి కల్పించినవారి) కొరకు." అని తమ ఊహలో చెబుతారు. వారి దేవతలకు చెందిన భాగం అల్లాహ్ కు చేరదు. మరియు అల్లాహ్ కు చెందిన భాగం వారి దేవతలకు చేరుతుంది. ఎలాంటి చెడు నిర్ణయాలు చేస్తున్నారు వీరు

Choose other languages: