Quran Apps in many lanuages:

Surah Yusuf Ayahs #42 Translated in Telugu

وَاتَّبَعْتُ مِلَّةَ آبَائِي إِبْرَاهِيمَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ ۚ مَا كَانَ لَنَا أَنْ نُشْرِكَ بِاللَّهِ مِنْ شَيْءٍ ۚ ذَٰلِكَ مِنْ فَضْلِ اللَّهِ عَلَيْنَا وَعَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ
మరియు నేను నా తండ్రి తాతలైన ఇబ్రాహీమ్, ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ ల యొక్క ధర్మాన్ని అవలంబించాము. అల్లాహ్ కు ఎవడినైనా సాటి కల్పించటం మా విధానం కాదు. వాస్తవానికి ఇది మాపై మరియు సర్వ మానవులపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహం. కాని చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు చూపరు
يَا صَاحِبَيِ السِّجْنِ أَأَرْبَابٌ مُتَفَرِّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ
ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! ఏమీ? చాలా మంది విభిన్న ప్రభువులు మేలా? లేక, తన సృష్టిపై సంపూర్ణాధికారం గల అద్వితీయుడైన అల్లాహ్ మేలా
مَا تَعْبُدُونَ مِنْ دُونِهِ إِلَّا أَسْمَاءً سَمَّيْتُمُوهَا أَنْتُمْ وَآبَاؤُكُمْ مَا أَنْزَلَ اللَّهُ بِهَا مِنْ سُلْطَانٍ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۚ أَمَرَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
ఆయన (అల్లాహ్) ను వదలి మీరు ఆరాధిస్తున్నవి - మీరు మరియు మీ తండ్రి తాతలు కల్పించుకున్న - పేర్లు మాత్రమే! దాని కొరకు అల్లాహ్ ఎలాంటి ప్రమాణాన్ని అవతరింప జేయలేదు. నిశ్చయంగా ఆజ్ఞాపించే అధికారం కేవలం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనను తప్ప మరొకరిని ఆరాధించరాదని ఆయన ఆజ్ఞాపించాడు. ఇదే సరైన ధర్మం, కానీ చాలా మందికి ఇది తెలియదు
يَا صَاحِبَيِ السِّجْنِ أَمَّا أَحَدُكُمَا فَيَسْقِي رَبَّهُ خَمْرًا ۖ وَأَمَّا الْآخَرُ فَيُصْلَبُ فَتَأْكُلُ الطَّيْرُ مِنْ رَأْسِهِ ۚ قُضِيَ الْأَمْرُ الَّذِي فِيهِ تَسْتَفْتِيَانِ
ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! మీలో ఒకడు తన యజమానికి మద్యపానం (సారాయి) త్రాగిస్తూ ఉంటాడు. ఇక రెండవ వాడు సిలువపై ఎక్కించబడతాడు మరియు అతని నెత్తిపై నుండి పక్షులు తింటూ ఉంటాయి. మీరు అడుగుతున్న (కలల) విషయం గురించి ఈ విధమైన తీర్పు ఇవ్వబడుతోంది
وَقَالَ لِلَّذِي ظَنَّ أَنَّهُ نَاجٍ مِنْهُمَا اذْكُرْنِي عِنْدَ رَبِّكَ فَأَنْسَاهُ الشَّيْطَانُ ذِكْرَ رَبِّهِ فَلَبِثَ فِي السِّجْنِ بِضْعَ سِنِينَ
మరియు వారిద్దరిలో విడుదల పొందుతాడని భావించని వాడితో (యూసుఫ్) అన్నాడు: నీ స్వామి దగ్గర నా ప్రస్తావన చెయ్యి." కాని అతనిని తన స్వామి దగ్గర ప్రస్తావన చేయటాన్ని షైతాన్ మరపింప జేశాడు, కావున (యూసుఫ్) చెరసాలలో మరికొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు

Choose other languages: