Quran Apps in many lanuages:

Surah Muhammad Ayahs #20 Translated in Telugu

وَمِنْهُمْ مَنْ يَسْتَمِعُ إِلَيْكَ حَتَّىٰ إِذَا خَرَجُوا مِنْ عِنْدِكَ قَالُوا لِلَّذِينَ أُوتُوا الْعِلْمَ مَاذَا قَالَ آنِفًا ۚ أُولَٰئِكَ الَّذِينَ طَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ
మరియు (ఓ ముహమ్మద్!) వారిలో (కపట విశ్వాసులలో) నీ మాటలను చెవి యొగ్గి వినేవారు కొందరున్నారు. కాని వారు నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తరువాత, జ్ఞానవంతులను ఇలా ప్రశ్నిస్తారు: అతను చెప్పినదేమిటి?" వీరే! అల్లాహ్ హృదయాల మీద ముద్రివేసిన వారు మరియు వీరే తమ మనోవాంఛలను అనుసరించేవారు
وَالَّذِينَ اهْتَدَوْا زَادَهُمْ هُدًى وَآتَاهُمْ تَقْوَاهُمْ
మరియు మార్గదర్శకత్వం పొందిన వారికి ఆయన (అల్లాహ్) ఇంకా ఎక్కువగా సన్మార్గం చూపుతాడు మరియు వారి దైవభీతిని వృద్ధి చేస్తాడు
فَهَلْ يَنْظُرُونَ إِلَّا السَّاعَةَ أَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۖ فَقَدْ جَاءَ أَشْرَاطُهَا ۚ فَأَنَّىٰ لَهُمْ إِذَا جَاءَتْهُمْ ذِكْرَاهُمْ
ఏమీ? ఇప్పుడు వారు అంతిమ ఘడియ అకస్మాత్తుగా రావాలని ఎదురు చూస్తున్నారా? వాస్తవానికి, దాని చిహ్నాలు కూడా వచ్చేశాయి. అది వచ్చిపడితే, ఇక వారికి హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడ ఉంటుంది
فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنْبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَاللَّهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ
కావున (ఓ ముహమ్మద్!) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. కావున నీ పాపాలకు మరియు విశ్వాస స్త్రీల కొరకు మరియు విశ్వాస పురుషుల కొరకు కూడా క్షమాపణ వేడుకో! మరియు అల్లాహ్ కు మీ కార్యకలాపాలు మరియు మీ (అంతిమ) నివాసం కూడా తెలుసు
وَيَقُولُ الَّذِينَ آمَنُوا لَوْلَا نُزِّلَتْ سُورَةٌ ۖ فَإِذَا أُنْزِلَتْ سُورَةٌ مُحْكَمَةٌ وَذُكِرَ فِيهَا الْقِتَالُ ۙ رَأَيْتَ الَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ يَنْظُرُونَ إِلَيْكَ نَظَرَ الْمَغْشِيِّ عَلَيْهِ مِنَ الْمَوْتِ ۖ فَأَوْلَىٰ لَهُمْ
మరియు విశ్వసించిన వారు ఇలా అంటున్నారు: (యుద్ధం చేయమని ఆదేశిస్తూ) ఒక సూరహ్ ఎందుకు అవతరింప జేయబడలేదు?" కాని ఇప్పుడు యుద్ధం చేయమని నిర్దేశిస్తూ ఒక సూరహ్ అవతరింప జేయబడితే తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు, మరణం ఆవహించిన వారి వలే నీ వైపునకు చూడటాన్ని, నీవు గమనిస్తావు. కాని అది వారికే మేలైనదై ఉండేది

Choose other languages: