Quran Apps in many lanuages:

Surah Muhammad Ayahs #23 Translated in Telugu

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنْبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَاللَّهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ
కావున (ఓ ముహమ్మద్!) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. కావున నీ పాపాలకు మరియు విశ్వాస స్త్రీల కొరకు మరియు విశ్వాస పురుషుల కొరకు కూడా క్షమాపణ వేడుకో! మరియు అల్లాహ్ కు మీ కార్యకలాపాలు మరియు మీ (అంతిమ) నివాసం కూడా తెలుసు
وَيَقُولُ الَّذِينَ آمَنُوا لَوْلَا نُزِّلَتْ سُورَةٌ ۖ فَإِذَا أُنْزِلَتْ سُورَةٌ مُحْكَمَةٌ وَذُكِرَ فِيهَا الْقِتَالُ ۙ رَأَيْتَ الَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ يَنْظُرُونَ إِلَيْكَ نَظَرَ الْمَغْشِيِّ عَلَيْهِ مِنَ الْمَوْتِ ۖ فَأَوْلَىٰ لَهُمْ
మరియు విశ్వసించిన వారు ఇలా అంటున్నారు: (యుద్ధం చేయమని ఆదేశిస్తూ) ఒక సూరహ్ ఎందుకు అవతరింప జేయబడలేదు?" కాని ఇప్పుడు యుద్ధం చేయమని నిర్దేశిస్తూ ఒక సూరహ్ అవతరింప జేయబడితే తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు, మరణం ఆవహించిన వారి వలే నీ వైపునకు చూడటాన్ని, నీవు గమనిస్తావు. కాని అది వారికే మేలైనదై ఉండేది
طَاعَةٌ وَقَوْلٌ مَعْرُوفٌ ۚ فَإِذَا عَزَمَ الْأَمْرُ فَلَوْ صَدَقُوا اللَّهَ لَكَانَ خَيْرًا لَهُمْ
ఆజ్ఞాపాలన చేయటం మరియు మంచి మాటలు పలుకటం. ఒకవేళ (జిహాద్ కొరకు) దృఢమైన నిర్ణయం తీసుకోబడినప్పుడు, వారు అల్లాహ్ విషయంలో సత్యవంతులుగా ఉన్నట్లయితే వారికే మేలు జరిగేది
فَهَلْ عَسَيْتُمْ إِنْ تَوَلَّيْتُمْ أَنْ تُفْسِدُوا فِي الْأَرْضِ وَتُقَطِّعُوا أَرْحَامَكُمْ
(వారితో ఇలా అను): ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా
أُولَٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّهُ فَأَصَمَّهُمْ وَأَعْمَىٰ أَبْصَارَهُمْ
ఇలాంటి వారినే అల్లాహ్ శపించాడు (బహిష్కరించాడు). వారిని చెవిటి వారిగా చేశాడు మరియు వారి కండ్లను గ్రుడ్డి చేశాడు

Choose other languages: