Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #53 Translated in Telugu

فَإِذَا مَسَّ الْإِنْسَانَ ضُرٌّ دَعَانَا ثُمَّ إِذَا خَوَّلْنَاهُ نِعْمَةً مِنَّا قَالَ إِنَّمَا أُوتِيتُهُ عَلَىٰ عِلْمٍ ۚ بَلْ هِيَ فِتْنَةٌ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
ఒకవేళ మానవునికి ఆపద వస్తే అతడు మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము మా దిక్కు నుండి అతనికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అతడు: నిశ్చయంగా, ఇది నాకున్న తెలివి వల్ల నాకు ఇవ్వబడింది!" అని అంటాడు. వాస్తవానికి, అది ఒక పరీక్ష, కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు
قَدْ قَالَهَا الَّذِينَ مِنْ قَبْلِهِمْ فَمَا أَغْنَىٰ عَنْهُمْ مَا كَانُوا يَكْسِبُونَ
వాస్తవానికి, వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే అన్నారు, కాని వారు సంపాదించినదంతా వారికి ఏ విధంగానూ పనికి రాలేదు
فَأَصَابَهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا ۚ وَالَّذِينَ ظَلَمُوا مِنْ هَٰؤُلَاءِ سَيُصِيبُهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا وَمَا هُمْ بِمُعْجِزِينَ
కావున, వారు చేసిన దుష్కార్యాల ఫలితాలు వారిపై పడ్డాయి. మరియు వారిలోని దుర్మార్గులు తాము చేసిన దుష్కార్యాల ఫలితాలను త్వరలోనే అనుభవించగలరు. మరియు వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు
أَوَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ
ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి
قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَىٰ أَنْفُسِهِمْ لَا تَقْنَطُوا مِنْ رَحْمَةِ اللَّهِ ۚ إِنَّ اللَّهَ يَغْفِرُ الذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
ఇలా అను: స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

Choose other languages: