Quran Apps in many lanuages:

Surah Ar-Rad Ayahs #14 Translated in Telugu

سَوَاءٌ مِنْكُمْ مَنْ أَسَرَّ الْقَوْلَ وَمَنْ جَهَرَ بِهِ وَمَنْ هُوَ مُسْتَخْفٍ بِاللَّيْلِ وَسَارِبٌ بِالنَّهَارِ
మీలో ఒకడు తన మాటను రహస్యంగా చెప్పినా, లేక దానిని బహిరంగంగా చెప్పినా మరియు ఒకడు రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో తిరుగుతూ ఉన్నా, (అల్లాహ్ దృష్టిలో) అంతా సమానమే (ఒకటే)
لَهُ مُعَقِّبَاتٌ مِنْ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ يَحْفَظُونَهُ مِنْ أَمْرِ اللَّهِ ۗ إِنَّ اللَّهَ لَا يُغَيِّرُ مَا بِقَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا مَا بِأَنْفُسِهِمْ ۗ وَإِذَا أَرَادَ اللَّهُ بِقَوْمٍ سُوءًا فَلَا مَرَدَّ لَهُ ۚ وَمَا لَهُمْ مِنْ دُونِهِ مِنْ وَالٍ
ప్రతివాని ముందూ వెనుకా ఆయన నియమించిన, ఒకరి వెంట ఒకరు వచ్చే కావలివారు (దైవదూతలు) ఉన్నారు. వారు అల్లాహ్ ఆజ్ఞానుసారం అతనిని (మనిషిని) కాపాడుతూ ఉంటారు. నిశ్చయంగా, ఒక జాతి వారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారి స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతి వారికి కీడు చేయదలిస్తే దానిని ఎవ్వరూ తొలగించలేరు. మరియు వారికి ఆయన తప్ప మరొక స్నేహితుడు (ఆదుకునేవాడు) లేడు
هُوَ الَّذِي يُرِيكُمُ الْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنْشِئُ السَّحَابَ الثِّقَالَ
ఆయనే! మీకు భయం మరియు ఆశ కలిగించే మెరుపులను చూపుతున్నాడు. మరియు ఆయనే నీళ్ళతో బరువెక్కిన మేఘాలను పుట్టిస్తున్నాడు
وَيُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهِ وَالْمَلَائِكَةُ مِنْ خِيفَتِهِ وَيُرْسِلُ الصَّوَاعِقَ فَيُصِيبُ بِهَا مَنْ يَشَاءُ وَهُمْ يُجَادِلُونَ فِي اللَّهِ وَهُوَ شَدِيدُ الْمِحَالِ
మరియు ఉరుము ఆయన పవిత్రతను కొనియాడుతుంది. ఆయన స్తోత్రం చేస్తుంది; మరియు దైవదూతలు కూడా ఆయన భయంతో (ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు)! మరియు ఆయన ఫెళఫెళమనే ఉరుములను పంపి, వాటి ద్వారా తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అయినా వీరు (సత్యతిరస్కారులు) అల్లాహ్ ను గురించి వాదులాడుతున్నారు. మరియు ఆయన అద్భుత యుక్తిపరుడు
لَهُ دَعْوَةُ الْحَقِّ ۖ وَالَّذِينَ يَدْعُونَ مِنْ دُونِهِ لَا يَسْتَجِيبُونَ لَهُمْ بِشَيْءٍ إِلَّا كَبَاسِطِ كَفَّيْهِ إِلَى الْمَاءِ لِيَبْلُغَ فَاهُ وَمَا هُوَ بِبَالِغِهِ ۚ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
ఆయనను ప్రార్థించటమే విద్యుక్త ధర్మం. ఆయనను వదలి వారు ప్రార్థించేవి (ఇతర శక్తులు) వారికి ఏ విధమైన సమాధాన మివ్వలేవు. అది (వాటిని వేడుకోవడం): ఒకడు తన రెండు చేతులు నీటి వైపుకు చాచి, అది (నీరు) నోటి దాకా రావాలని ఆశించటమే! కాని అది అతని (నోటి వరకు) చేరదు కదా! (అలాగే) సత్యతిరస్కారుల ప్రార్థనలన్నీ వ్యర్థమై పోతాయి

Choose other languages: