Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #72 Translated in Telugu

وَلَهَدَيْنَاهُمْ صِرَاطًا مُسْتَقِيمًا
మరియు మేము వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసి ఉండేవారం
وَمَنْ يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا
మరియు ఎవరు అల్లాహ్ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ, (అల్లాహ్) ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల (షహీదుల) తోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది
ذَٰلِكَ الْفَضْلُ مِنَ اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ عَلِيمًا
అల్లాహ్ నుండి లభించే అనుగ్రహం ఇలాంటిదే. మరియు (యథార్థం) తెలుసుకోవటానికి అల్లాహ్ చాలు
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا خُذُوا حِذْرَكُمْ فَانْفِرُوا ثُبَاتٍ أَوِ انْفِرُوا جَمِيعًا
ఓ విశ్వాసులారా! మీరు (అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధమై) తగిన జాగ్రత్తలు వహించండి! మీరు (యుద్ధానికి) జట్లుగానో లేదా అందరూ కలిసియో బయలు దేరండి
وَإِنَّ مِنْكُمْ لَمَنْ لَيُبَطِّئَنَّ فَإِنْ أَصَابَتْكُمْ مُصِيبَةٌ قَالَ قَدْ أَنْعَمَ اللَّهُ عَلَيَّ إِذْ لَمْ أَكُنْ مَعَهُمْ شَهِيدًا
మరియు వాస్తవానికి మీలో వెనుక ఉండి పోయేవాడు ఉన్నాడు. ఒకవేళ మీకు ఏమైనా ఆపద వస్తే అప్పుడు వాడు: వాస్తవానికి అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు, అందుకే నేను కూడా వారితో పాటు లేను!" అని అంటాడు

Choose other languages: