Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #64 Translated in Telugu

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ آمَنُوا بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا أُنْزِلَ مِنْ قَبْلِكَ يُرِيدُونَ أَنْ يَتَحَاكَمُوا إِلَى الطَّاغُوتِ وَقَدْ أُمِرُوا أَنْ يَكْفُرُوا بِهِ وَيُرِيدُ الشَّيْطَانُ أَنْ يُضِلَّهُمْ ضَلَالًا بَعِيدًا
(ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని (కపట విశ్వాసులను) నీవు ఎరుగవా (చూడలేదా)? తిరస్కరించండని ఆదేశింపబడినా, వారు తమ (వ్యవహారాల) పరిష్కారాలకు తాగూత్ వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షైతాన్ వారిని, త్రోవ తప్పించి, దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొని పోవాలని కోరుతుంటాడు
وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنْزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنَافِقِينَ يَصُدُّونَ عَنْكَ صُدُودًا
మరియు వారితో: అల్లాహ్ అవతరింపజేసిన వాటి (ఆదేశాల) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని చెప్పినపుడు, నీవు ఆ కపట విశ్వాసులను విముఖులై (నీ వైపునకు రాకుండా) తొలిగి పోవటాన్ని చూస్తావు
فَكَيْفَ إِذَا أَصَابَتْهُمْ مُصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ جَاءُوكَ يَحْلِفُونَ بِاللَّهِ إِنْ أَرَدْنَا إِلَّا إِحْسَانًا وَتَوْفِيقًا
అయితే వారు తమ చేతులారా చేసుకున్న (దుష్కార్యాల) ఫలితంగా వారికి బాధ కలిగినపుడు, వారు నీ దగ్గరకు వచ్చి అల్లాహ్ పేర ప్రమాణాలు చేస్తూ: మేము మేలు చేయాలనీ మరియు ఐకమత్యం చేకూర్చాలనీ మాత్రమే ప్రయత్నించాము." అని అంటారు
أُولَٰئِكَ الَّذِينَ يَعْلَمُ اللَّهُ مَا فِي قُلُوبِهِمْ فَأَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُلْ لَهُمْ فِي أَنْفُسِهِمْ قَوْلًا بَلِيغًا
అలాంటి వారినీ (కపట విశ్వాసులనూ) ! వారి హృదయాలలో ఉన్నదీ అల్లాహ్ ఎరుగును, కావున వారి నుండి ముఖం త్రిప్పుకో, వారికి ఉపదేశం చెయ్యి మరియు వారిని గురించి వారి హృదయాలు ప్రభావితమయ్యే మాట పలుకు
وَمَا أَرْسَلْنَا مِنْ رَسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ اللَّهِ ۚ وَلَوْ أَنَّهُمْ إِذْ ظَلَمُوا أَنْفُسَهُمْ جَاءُوكَ فَاسْتَغْفَرُوا اللَّهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُولُ لَوَجَدُوا اللَّهَ تَوَّابًا رَحِيمًا
మరియు మేము ఏ ప్రవక్తను పంపినా - అల్లాహ్ అనుజ్ఞతో - (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము. మరియు ఒకవేళ వారు తమకు తాము అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి వారు అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరినప్పుడు - ప్రవక్త కూడా వారికై అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కొరకు వేడుకున్నప్పుడు - వారు అల్లాహ్ ను నిశ్చయంగా, క్షమించేవాడు గానూ మరియు కరుణాప్రదాత గానూ పొందుతారు

Choose other languages: