Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #65 Translated in Telugu

وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَدْ دَخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ
మరియు వారు (కపట విశ్వాసులు) నీ వద్దకు వచ్చినప్పుడు: మేము విశ్వసించాము." అని అంటారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారంతోనే వస్తారు మరియు దాని (సత్యతిరస్కారం) తోనే తిరిగి పోతారు కూడాను. మరియు వారు ఏమి దాస్తున్నారో అల్లాహ్ కు బాగా తెలుసు
وَتَرَىٰ كَثِيرًا مِنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ
మరియు వారిలో అనేకులను పాపం మరియు దౌర్జన్యం చేయటానికి మరియు నిషిద్ధమైనవి తినటానికి చురుకుగా పాల్గొనటాన్ని నీవు చూస్తావు. వారు చేస్తున్న పనులు ఎంత నీచమైనవి
لَوْلَا يَنْهَاهُمُ الرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ عَنْ قَوْلِهِمُ الْإِثْمَ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ
వారి ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్) మరియు మతాచారులు (అహ్ బార్) వారిని, పాపపు మాటలు పలకటం నుండి మరియు నిషిద్ధమైన వాటిని తినటం నుండి ఎందుకు వారించరు? వారు చేసే కార్యాలు ఎంత నీచమైనవి
وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنْفِقُ كَيْفَ يَشَاءُ ۚ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِنْهُمْ مَا أُنْزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۚ وَأَلْقَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ كُلَّمَا أَوْقَدُوا نَارًا لِلْحَرْبِ أَطْفَأَهَا اللَّهُ ۚ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا ۚ وَاللَّهُ لَا يُحِبُّ الْمُفْسِدِينَ
మరియు యూదులు: అల్లాహ్ చేతులకు సంకెళ్ళు పడి ఉన్నాయి." అని అంటారు. వారి చేతులకే సంకెళ్ళు వేయబడుగాక! మరియు వారు పలికిన దానికి వారు శపించబడుగాక! వాస్తవానికి ఆయన (అల్లాహ్) రెండు చేతులు విస్తరింపబడి ఉన్నాయి; ఆయన (తన అనుగ్రహాలను) తాను కోరినట్లు ఖర్చు చేస్తాడు. మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తరపు నుండి నీపై అవతరింపజేయబడినది (ఈ గ్రంథం) నిశ్చయంగా, వారిలో చాలా మందికి తలబిరుసుతనం మరియు సత్య తిరస్కారాన్ని మాత్రమే పెంచుతున్నది. మరియు మేము వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని, తీర్పుదినం వరకు ఉండేటట్లు చేశాము. వారు యుద్ధ జ్వాలలను ప్రజ్వలింపజేసినపుడల్లా, అల్లాహ్ దానిని చల్లార్చాడు. మరియు వారు భూమిలో కల్లోలం రేకెత్తించటానికి పాటు పడుతున్నారు. మరియు అల్లాహ్ కల్లోలం రేకెత్తించే వారిని ప్రేమించడు
وَلَوْ أَنَّ أَهْلَ الْكِتَابِ آمَنُوا وَاتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأَدْخَلْنَاهُمْ جَنَّاتِ النَّعِيمِ
మరియు వాస్తవానికి గ్రంథ ప్రజలు విశ్వసించి, దైవభీతి కలిగి వుంటే! నిశ్చయంగా, మేము వారి పాపాలను తొలగించి, వారిని శ్రేష్ఠమైన స్వర్గవనాలలో ప్రవేశింపజేసి ఉండేవారము

Choose other languages: