Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #98 Translated in Telugu

وَمَا مَنَعَ النَّاسَ أَنْ يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَىٰ إِلَّا أَنْ قَالُوا أَبَعَثَ اللَّهُ بَشَرًا رَسُولًا
మరియు ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా వారిని ఆపిందేమిటి? వారు (మూఢ విశ్వాసంలో మునిగి): ఏమీ? అల్లాహ్ మానవుణ్ణి తన సందేశహరునిగా పంపాడా?" అని పలకడం తప్ప
قُلْ لَوْ كَانَ فِي الْأَرْضِ مَلَائِكَةٌ يَمْشُونَ مُطْمَئِنِّينَ لَنَزَّلْنَا عَلَيْهِمْ مِنَ السَّمَاءِ مَلَكًا رَسُولًا
ఇలా అను: ఒకవేళ భూమి మీద దేవదూతలు నివసిస్తూ నిశ్చింతగా తిరుగుతూ ఉండినట్లయితే, మేము వారి కొరకు దేవదూతనే సందేశహరునిగా పంపి ఉండేవారము
قُلْ كَفَىٰ بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا
ఇలా అను: నాకూ మరియు మీకూ మధ్య అల్లాహ్ యే సాక్షిగా చాలు. నిశ్చయంగా ఆయన తన దాసులను బాగా ఎరుగువాడు, సర్వదృష్టికర్త
وَمَنْ يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ ۖ وَمَنْ يُضْلِلْ فَلَنْ تَجِدَ لَهُمْ أَوْلِيَاءَ مِنْ دُونِهِ ۖ وَنَحْشُرُهُمْ يَوْمَ الْقِيَامَةِ عَلَىٰ وُجُوهِهِمْ عُمْيًا وَبُكْمًا وَصُمًّا ۖ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ كُلَّمَا خَبَتْ زِدْنَاهُمْ سَعِيرًا
మరియు ఎవడికి అల్లాహ్ మార్గదర్శకత్వం చేస్తాడో అతడే సన్మార్గం పొందుతాడు. మరియు ఎవడిని ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో వాడికి, ఆయన తప్ప, ఇతరుల నెవ్వరినీ నీవు సంరక్షకులుగా పొందలేవు. మరియు వారిని మేము పునరుత్థాన దినమున గ్రుడ్డివారిగా, మూగవారిగా మరియు చెవిటివారిగా చేసి, వారి ముఖాల మీద బోర్లా పడవేసి లాగుతూ ప్రోగుచేస్తాము. వారి ఆశ్రయం నరకమే! అది చల్లారినప్పుడల్లా మేము వారికై అగ్నిజ్వాలను తీవ్రం చేస్తాము
ذَٰلِكَ جَزَاؤُهُمْ بِأَنَّهُمْ كَفَرُوا بِآيَاتِنَا وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا
అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు: ఏమీ? మేము ఎముకలుగా, పొడిగా మారిపోయిన తరువాత కూడా, సరిక్రొత్త సృష్టిగా మళ్ళీ లేపబడతామా

Choose other languages: