Quran Apps in many lanuages:

Surah Al-Isra Ayahs #101 Translated in Telugu

وَمَنْ يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ ۖ وَمَنْ يُضْلِلْ فَلَنْ تَجِدَ لَهُمْ أَوْلِيَاءَ مِنْ دُونِهِ ۖ وَنَحْشُرُهُمْ يَوْمَ الْقِيَامَةِ عَلَىٰ وُجُوهِهِمْ عُمْيًا وَبُكْمًا وَصُمًّا ۖ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ كُلَّمَا خَبَتْ زِدْنَاهُمْ سَعِيرًا
మరియు ఎవడికి అల్లాహ్ మార్గదర్శకత్వం చేస్తాడో అతడే సన్మార్గం పొందుతాడు. మరియు ఎవడిని ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో వాడికి, ఆయన తప్ప, ఇతరుల నెవ్వరినీ నీవు సంరక్షకులుగా పొందలేవు. మరియు వారిని మేము పునరుత్థాన దినమున గ్రుడ్డివారిగా, మూగవారిగా మరియు చెవిటివారిగా చేసి, వారి ముఖాల మీద బోర్లా పడవేసి లాగుతూ ప్రోగుచేస్తాము. వారి ఆశ్రయం నరకమే! అది చల్లారినప్పుడల్లా మేము వారికై అగ్నిజ్వాలను తీవ్రం చేస్తాము
ذَٰلِكَ جَزَاؤُهُمْ بِأَنَّهُمْ كَفَرُوا بِآيَاتِنَا وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا
అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు: ఏమీ? మేము ఎముకలుగా, పొడిగా మారిపోయిన తరువాత కూడా, సరిక్రొత్త సృష్టిగా మళ్ళీ లేపబడతామా
أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ قَادِرٌ عَلَىٰ أَنْ يَخْلُقَ مِثْلَهُمْ وَجَعَلَ لَهُمْ أَجَلًا لَا رَيْبَ فِيهِ فَأَبَى الظَّالِمُونَ إِلَّا كُفُورًا
ఏమీ? వారు చూడటం లేదా (ఎరుగరా)? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడనీ మరియు వారి వంటి వారినీ సృష్టించగల సమర్ధుడనీ మరియు ఆయనే వారి కొరకు ఒక నిర్ణీత సమయాన్ని నియమించాడనీ, దానిని (ఆ సమయాన్ని) గురించి ఎలాంటి సందేహం లేదనీ; అయినా ఈ దుర్మార్గులు మొండిగా సత్యాన్ని తిరస్కరించటానికే పూనుకున్నారు
قُلْ لَوْ أَنْتُمْ تَمْلِكُونَ خَزَائِنَ رَحْمَةِ رَبِّي إِذًا لَأَمْسَكْتُمْ خَشْيَةَ الْإِنْفَاقِ ۚ وَكَانَ الْإِنْسَانُ قَتُورًا
వారితో అను: ఒకవేళ మీరు నా ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులను పొంది వున్నా, అవి ఖర్చయి పోతాయేమోననే భయంతో, వాటిని మీరు పట్టుకొని (ఖర్చు చేయకుండా) ఉండేవారు. మరియు వాస్తవానికి మానవుడు ఎంతో లోభి
وَلَقَدْ آتَيْنَا مُوسَىٰ تِسْعَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ فَاسْأَلْ بَنِي إِسْرَائِيلَ إِذْ جَاءَهُمْ فَقَالَ لَهُ فِرْعَوْنُ إِنِّي لَأَظُنُّكَ يَا مُوسَىٰ مَسْحُورًا
మరియు మేము వాస్తవానికి, మూసాకు స్పష్టమైన తొమ్మిది అద్భుత సూచనలను ప్రసాదించాము. ఇస్రాయీల్ సంతతి వారిని అడుగు, అతను (మూసా) వారి వద్దకు వచ్చినపుడు ఫిరఔన్ అతనితో అన్నాడు: ఓ మూసా! నిశ్చయంగా, నీవు మంత్రజాలానికి గురి అయ్యావని నేను భావిస్తున్నాను

Choose other languages: