Quran Apps in many lanuages:

Surah Al-Hadid Ayahs #19 Translated in Telugu

فَالْيَوْمَ لَا يُؤْخَذُ مِنْكُمْ فِدْيَةٌ وَلَا مِنَ الَّذِينَ كَفَرُوا ۚ مَأْوَاكُمُ النَّارُ ۖ هِيَ مَوْلَاكُمْ ۖ وَبِئْسَ الْمَصِيرُ
కావున ఈ రోజు మీ నుండి ఏ విధమైన పరిహారం తీసుకోబడదు. మరియు సత్యతిరస్కారుల నుండి కూడా తీసుకోబడదు. మీ నివాసం నరకమే, అది మీ ఆశ్రయం. ఎంత చెడ్డ గమ్యస్థానం
أَلَمْ يَأْنِ لِلَّذِينَ آمَنُوا أَنْ تَخْشَعَ قُلُوبُهُمْ لِذِكْرِ اللَّهِ وَمَا نَزَلَ مِنَ الْحَقِّ وَلَا يَكُونُوا كَالَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلُ فَطَالَ عَلَيْهِمُ الْأَمَدُ فَقَسَتْ قُلُوبُهُمْ ۖ وَكَثِيرٌ مِنْهُمْ فَاسِقُونَ
ఏమీ? విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో కృంగిపోయి, ఆయన అవతరింప జేసిన సత్యానికి విధేయులయ్యే సమయం ఇంకా రాలేదా? పూర్వ గ్రంథ ప్రజల్లాగా వారు కూడా మారిపోకూడదు. ఎందుకంటే చాలా కాలం గడిచి పోయినందుకు వారి హృదయాలు కఠినమై పోయాయి. మరియు వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు
اعْلَمُوا أَنَّ اللَّهَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ قَدْ بَيَّنَّا لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
బాగా తెలుసుకోండి! నిశ్చయంగా అల్లాహ్, భూమి చనిపోయిన తరువాత, దానికి మళ్ళీ జీవం పోస్తాడు. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టంగా తెలుపుతున్నాము, బహుశా మీరు అర్థం చేసుకుంటారని
إِنَّ الْمُصَّدِّقِينَ وَالْمُصَّدِّقَاتِ وَأَقْرَضُوا اللَّهَ قَرْضًا حَسَنًا يُضَاعَفُ لَهُمْ وَلَهُمْ أَجْرٌ كَرِيمٌ
నిశ్చయంగా, విధి దానం (జకాత్) చేసే పురుషులు మరియు విధిదానం చేసే స్త్రీలు మరియు అల్లాహ్ కు మంచి అప్పు ఇచ్చే వారికి, ఆయన దానిని ఎన్నో రెట్లు పెంచి (తిరిగి) ఇస్తాడు. మరియు వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది
وَالَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرُسُلِهِ أُولَٰئِكَ هُمُ الصِّدِّيقُونَ ۖ وَالشُّهَدَاءُ عِنْدَ رَبِّهِمْ لَهُمْ أَجْرُهُمْ وَنُورُهُمْ ۖ وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
మరియు ఎవరైతే అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసిస్తారో, అలాంటి వారే సత్యసంధులైన (విశ్వాసులు). మరియు వారే తమ ప్రభువు వద్ద అమర వీరులు. వారికి వారి ప్రతిఫలం మరియు జ్యోతి లభిస్తాయి. కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా ఆయతులను అబద్ధాలని అంటారో, అలాంటి వారు తప్పక భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు

Choose other languages: