Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #77 Translated in Telugu

فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا ۚ كَذَٰلِكَ يُحْيِي اللَّهُ الْمَوْتَىٰ وَيُرِيكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
కనుక మేము: దానిని (ఆ శవాన్ని), ఆ ఆవు (మాంసపు) ఒక ముక్కతో కొట్టండి, (అతడు సజీవుడవుతాడు)." అని ఆజ్ఞాపించాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి, తన సూచనలను మీకు చూపుతున్నాడు, బహుశా మీరు అర్థం చేసుకుంటారేమోనని
ثُمَّ قَسَتْ قُلُوبُكُمْ مِنْ بَعْدِ ذَٰلِكَ فَهِيَ كَالْحِجَارَةِ أَوْ أَشَدُّ قَسْوَةً ۚ وَإِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
కానీ దీని తరువాత కూడా మీ హృదయాలు కఠినమైపోయాయి, అవి రాళ్ళ మాదిరిగా! కాదు, వాటి కంటే కూడా కఠినంగా అయిపోయాయి. ఎందుకంటే వాస్తవానికి రాళ్ళలో కొన్ని బ్రద్దలైనప్పుడు వాటి నుండి సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మరియు నిశ్చయంగా, వాటిలో కొన్ని చీలిపోయి వాటి నుండి నీళ్ళు బయటికి వస్తాయి. మరియు వాస్తవానికి వాటిలో మరికొన్ని అల్లాహ్ భయం వల్ల పడిపోతాయి. మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు
أَفَتَطْمَعُونَ أَنْ يُؤْمِنُوا لَكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِنْهُمْ يَسْمَعُونَ كَلَامَ اللَّهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِنْ بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ
(ఓ విశ్వాసులారా!) వారు (యూదులు) మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఆశిస్తున్నారా ఏమిటి ? మరియు వాస్తవానికి వారిలో ఒక వర్గం వారు (ధర్మవేత్తలు) అల్లాహ్ ప్రవచనం (తౌరాత్) విని, అర్థం చేసుకొని కూడా, బుద్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసేవారు కదా
وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ قَالُوا أَتُحَدِّثُونَهُمْ بِمَا فَتَحَ اللَّهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُمْ بِهِ عِنْدَ رَبِّكُمْ ۚ أَفَلَا تَعْقِلُونَ
మరియు వారు (యూదులు) విశ్వాసులను కలిసినప్పుడు: మేము విశ్వసించాము!" అని అంటారు. కాని వారు ఏకాంతంలో (తమ తెగవారితో) ఒకరినొకరు కలుసుకున్నప్పుడు: ఏమీ? అల్లాహ్ మీకు తెలిపింది వారికి (ముస్లింలకు) తెలుపుతారా! దానితో వారు (ముస్లింలు) మీ ప్రభువు ముందు మీతో వాదులాడటానికి! మీరిది అర్థం చేసుకోలేరా ఏమిటి?" అని అంటారు
أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ
ఏమీ? వారికి తెలియదా? వారు (యూదులు) దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా అల్లాహ్ కు బాగా తెలుసని

Choose other languages: