Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #79 Translated in Telugu

أَفَتَطْمَعُونَ أَنْ يُؤْمِنُوا لَكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِنْهُمْ يَسْمَعُونَ كَلَامَ اللَّهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِنْ بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ
(ఓ విశ్వాసులారా!) వారు (యూదులు) మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఆశిస్తున్నారా ఏమిటి ? మరియు వాస్తవానికి వారిలో ఒక వర్గం వారు (ధర్మవేత్తలు) అల్లాహ్ ప్రవచనం (తౌరాత్) విని, అర్థం చేసుకొని కూడా, బుద్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసేవారు కదా
وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ قَالُوا أَتُحَدِّثُونَهُمْ بِمَا فَتَحَ اللَّهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُمْ بِهِ عِنْدَ رَبِّكُمْ ۚ أَفَلَا تَعْقِلُونَ
మరియు వారు (యూదులు) విశ్వాసులను కలిసినప్పుడు: మేము విశ్వసించాము!" అని అంటారు. కాని వారు ఏకాంతంలో (తమ తెగవారితో) ఒకరినొకరు కలుసుకున్నప్పుడు: ఏమీ? అల్లాహ్ మీకు తెలిపింది వారికి (ముస్లింలకు) తెలుపుతారా! దానితో వారు (ముస్లింలు) మీ ప్రభువు ముందు మీతో వాదులాడటానికి! మీరిది అర్థం చేసుకోలేరా ఏమిటి?" అని అంటారు
أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ
ఏమీ? వారికి తెలియదా? వారు (యూదులు) దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా అల్లాహ్ కు బాగా తెలుసని
وَمِنْهُمْ أُمِّيُّونَ لَا يَعْلَمُونَ الْكِتَابَ إِلَّا أَمَانِيَّ وَإِنْ هُمْ إِلَّا يَظُنُّونَ
మరియు వారిలో (యూదులలో) కొందరు నిరక్షరాస్యులున్నారు, వారికి గ్రంథ జ్ఞానం లేదు, వారు కేవలం మూఢవిశ్వాసాలను (నమ్ముతూ), ఊహలపై మాత్రమే ఆధారపడి ఉన్నారు
فَوَيْلٌ لِلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنْ عِنْدِ اللَّهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَوَيْلٌ لَهُمْ مِمَّا كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٌ لَهُمْ مِمَّا يَكْسِبُونَ
కావున ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి - దాని వల్ల తుచ్ఛమూల్యం పొందే నిమిత్తం - ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది." అని (ప్రజలకు) చెబుతారో, వారికి వినాశముంది. వారి చేతులు వ్రాసినందుకు వారికి వినాశముంది మరియు వారు సంపాదించిన దానికి కూడా వారికి వినాశముంది

Choose other languages: