Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #53 Translated in Telugu

وَإِذْ نَجَّيْنَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُمْ بَلَاءٌ مِنْ رَبِّكُمْ عَظِيمٌ
మరియు ఫిరఔన్ జాతివారి (బానిసత్వం) నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోరహింసకు గురిచేస్తూ ఉండేవారు; మీ కుమారులను వధించి, మీ స్త్రీలను సజీవులుగా విడిచి పెట్టేవారు మరియు ఇందులో మీ ప్రభువు తరఫు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండెను
وَإِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَأَنْجَيْنَاكُمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ وَأَنْتُمْ تَنْظُرُونَ
మరియు మేము మీ కొరకు సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని రక్షించి నప్పుడు మీరు చూస్తూ ఉండగానే ఫిర్ఔన్ జాతి వారిని ముంచి వేసిన సంఘటనను (గుర్తుకు తెచ్చుకోండి)
وَإِذْ وَاعَدْنَا مُوسَىٰ أَرْبَعِينَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهِ وَأَنْتُمْ ظَالِمُونَ
ఇంకా (జ్ఞాపకం చేసుకోండి), మేము మూసాను నలభై రాత్రుల వాగ్దానం చేసి (పిలిచినపుడు) మీరు అతను లేకపోవడం చూసి ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకున్నారు. మరియు మీరు దుర్మార్గులయ్యారు
ثُمَّ عَفَوْنَا عَنْكُمْ مِنْ بَعْدِ ذَٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُونَ
అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమోనని మేము మిమ్మల్ని మన్నించాము
وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ! మీరు సన్మార్గులవుతారేమోనని మేము మూసాకు గ్రంథాన్ని మరియు (సత్యా-సత్యాలను వేరే చేసే) గీటురాయిని ప్రసాదించాము

Choose other languages: