Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #149 Translated in Telugu

وَلَئِنْ أَتَيْتَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ بِكُلِّ آيَةٍ مَا تَبِعُوا قِبْلَتَكَ ۚ وَمَا أَنْتَ بِتَابِعٍ قِبْلَتَهُمْ ۚ وَمَا بَعْضُهُمْ بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍ ۚ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُمْ مِنْ بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ إِنَّكَ إِذًا لَمِنَ الظَّالِمِينَ
మరియు నీవు గ్రంథప్రజలకు ఎన్ని సూచనలు (ఆయాత్) చూపినా, వారు నీ ఖిబ్లాను అనుసరించరు. మరియు వారిలో ఒక వర్గం వారు, మరొక వర్గం వారి ఖిబ్లాను అనుసరించరు. మరియు నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడా వారి మనోవాంఛలను అనుసరిస్తే! నిశ్చయంగా, నీవు దుర్గార్గులలో చేరిన వాడవుతావు
الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمْ ۖ وَإِنَّ فَرِيقًا مِنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَهُمْ يَعْلَمُونَ
మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏ విధంగా గుర్తిస్తారో ఇతనిని (ముహమ్మద్ ను) కూడా ఆ విధంగా గుర్తిస్తారు. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గం వారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు
الْحَقُّ مِنْ رَبِّكَ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
(నిస్సందేహంగా!) ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున నీవు సందేహించేవారిలో ఏ మాత్రం చేరకు
وَلِكُلٍّ وِجْهَةٌ هُوَ مُوَلِّيهَا ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ أَيْنَ مَا تَكُونُوا يَأْتِ بِكُمُ اللَّهُ جَمِيعًا ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మరియు ప్రతి ఒక (సంఘం) ఒక దిశ వైపునకు ముఖం త్రిప్పుతుంది. కావున మీరు మంచిపనులు చేయటానికి త్వరపడండి. మీరెక్కడున్నా సరే, అల్లాహ్ మీ అందరినీ (తీర్పుదినం నాడు తన సన్నిధిలోకి) రప్పిస్తాడు. నిశ్చయంగా! అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు
وَمِنْ حَيْثُ خَرَجْتَ فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ ۖ وَإِنَّهُ لَلْحَقُّ مِنْ رَبِّكَ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
మరియు నీవు ఎక్కడికి బయలు దేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్ లో) మస్జిద్ అల్ హరామ్ వైపునకే త్రిప్పుకో. మరియు నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు

Choose other languages: