Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #69 Translated in Telugu

وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ
ఇంకా మేము ఆద్ (జాతి) వద్దకు వారి సోదరుడైన హూద్ ను పంపాము. అతను: ఓ నా జాతి సోదరులారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొకు ఆరాధ్య దైవుడు లేడు. ఏమీ? మీకు దైవభీతి లేదా ?" అని అన్నాడు
قَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِنْ قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ
అతని జాతివారిలో సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: మేము, నిశ్చయంగా నిన్ను మూఢత్వంలో చూస్తున్నాము మరియు నిశ్చయంగా,నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము
قَالَ يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِنْ رَبِّ الْعَالَمِينَ
(హూద్) అన్నాడు: నా జాతి ప్రజలారా! నాలో ఏ మూఢత్వం లేదు. మరియు నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను
أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ
నేను మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తున్నాను మరియు నిశ్చయంగా, నేను మీకు నమ్మదగిన ఉపదేశకుడను
أَوَعَجِبْتُمْ أَنْ جَاءَكُمْ ذِكْرٌ مِنْ رَبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِنْكُمْ لِيُنْذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِنْ بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
లేదా ! మిమ్మల్ని హెచ్చరించటానికి మీ ప్రభువు తరఫు నుండి హితోపదేశం - మీలోని ఒక పురుషుని ద్వారా వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా? నూహ్ జాతి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి, మీకు అపార బలాధిక్యతను ఇచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఈ విధంగా అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు

Choose other languages: