Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #71 Translated in Telugu

قَالَ يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِنْ رَبِّ الْعَالَمِينَ
(హూద్) అన్నాడు: నా జాతి ప్రజలారా! నాలో ఏ మూఢత్వం లేదు. మరియు నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుడను
أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ
నేను మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తున్నాను మరియు నిశ్చయంగా, నేను మీకు నమ్మదగిన ఉపదేశకుడను
أَوَعَجِبْتُمْ أَنْ جَاءَكُمْ ذِكْرٌ مِنْ رَبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِنْكُمْ لِيُنْذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِنْ بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
లేదా ! మిమ్మల్ని హెచ్చరించటానికి మీ ప్రభువు తరఫు నుండి హితోపదేశం - మీలోని ఒక పురుషుని ద్వారా వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా? నూహ్ జాతి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి, మీకు అపార బలాధిక్యతను ఇచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఈ విధంగా అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు
قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا ۖ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ
వారన్నారు: మేము అల్లాహ్ ను ఒక్కణ్ణి మాత్రమే ఆరాధించి, మా తండ్రితాతలు ఆరాధించే వాటిని వదలిపెట్టమని (చెప్పటానికి) నీవు మా వద్దకు వచ్చావా? ఒకవేళ నీవు సత్యవంతుడవే అయితే మమ్మల్ని భయపెట్టే దానిని (శిక్షను) తీసుకొనిరా
قَالَ قَدْ وَقَعَ عَلَيْكُمْ مِنْ رَبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنْتُمْ وَآبَاؤُكُمْ مَا نَزَّلَ اللَّهُ بِهَا مِنْ سُلْطَانٍ ۚ فَانْتَظِرُوا إِنِّي مَعَكُمْ مِنَ الْمُنْتَظِرِينَ
(హూద్) అన్నాడు: వాస్తవానికి మీపై మీ ప్రభువు యొక్క ఆగ్రహం మరియు శిక్ష విరుచుకుపడ్డాయి, అల్లాహ్ ఏ ప్రమాణం ఇవ్వకున్నా - మీరు మరియు మీ తండ్రితాతలు పెట్టుకున్న (కల్పిత) పేర్ల విషయంలో - నాతో వాదులాడుతున్నారా? సరే, అయితే మీరు నిరీక్షించండి, మీతో పాటు నేనూ నిరీక్షిస్తాను

Choose other languages: