Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #73 Translated in Telugu

أَوَعَجِبْتُمْ أَنْ جَاءَكُمْ ذِكْرٌ مِنْ رَبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِنْكُمْ لِيُنْذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِنْ بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
లేదా ! మిమ్మల్ని హెచ్చరించటానికి మీ ప్రభువు తరఫు నుండి హితోపదేశం - మీలోని ఒక పురుషుని ద్వారా వచ్చిందని మీరు ఆశ్చర్యపడుతున్నారా? నూహ్ జాతి పిదప మిమ్మల్ని వారసులుగా చేసి, మీకు అపార బలాధిక్యతను ఇచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఈ విధంగా అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు
قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا ۖ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ
వారన్నారు: మేము అల్లాహ్ ను ఒక్కణ్ణి మాత్రమే ఆరాధించి, మా తండ్రితాతలు ఆరాధించే వాటిని వదలిపెట్టమని (చెప్పటానికి) నీవు మా వద్దకు వచ్చావా? ఒకవేళ నీవు సత్యవంతుడవే అయితే మమ్మల్ని భయపెట్టే దానిని (శిక్షను) తీసుకొనిరా
قَالَ قَدْ وَقَعَ عَلَيْكُمْ مِنْ رَبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنْتُمْ وَآبَاؤُكُمْ مَا نَزَّلَ اللَّهُ بِهَا مِنْ سُلْطَانٍ ۚ فَانْتَظِرُوا إِنِّي مَعَكُمْ مِنَ الْمُنْتَظِرِينَ
(హూద్) అన్నాడు: వాస్తవానికి మీపై మీ ప్రభువు యొక్క ఆగ్రహం మరియు శిక్ష విరుచుకుపడ్డాయి, అల్లాహ్ ఏ ప్రమాణం ఇవ్వకున్నా - మీరు మరియు మీ తండ్రితాతలు పెట్టుకున్న (కల్పిత) పేర్ల విషయంలో - నాతో వాదులాడుతున్నారా? సరే, అయితే మీరు నిరీక్షించండి, మీతో పాటు నేనూ నిరీక్షిస్తాను
فَأَنْجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ بِرَحْمَةٍ مِنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ وَمَا كَانُوا مُؤْمِنِينَ
కావున తుదకు మేము అతనిని (హూద్ ను) మరియు అతని తోటి వారిని మా అనుగ్రహంతో రక్షించాము. మరియు మా సూచనలు అసత్యాలని తిరస్కరించిన వారిని నిర్మూలించాము. ఎందుకంటే వారు విశ్వసించకుండా ఉన్నారు
وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَالِحًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ قَدْ جَاءَتْكُمْ بَيِّنَةٌ مِنْ رَبِّكُمْ ۖ هَٰذِهِ نَاقَةُ اللَّهِ لَكُمْ آيَةً ۖ فَذَرُوهَا تَأْكُلْ فِي أَرْضِ اللَّهِ ۖ وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ أَلِيمٌ
ఇక సమూద్ జాతి వారి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ ను పంపాము. అతను వారితో! నా జాతి సోదరులారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి ఒక స్పష్టమైన సూచన వచ్చింది. ఇది అల్లాహ్ మీకు ఒక అద్భుత సూచనగా పంపిన ఆడ ఒంటె. కావున దీనిని అల్లాహ్ భూమిపై మేయటానికి వదలిపెట్టిండి. మరియు హాని కలిగించే ఉద్దేశంతో దీనిని ముట్టుకోకండి. ఆలా చేస్తే మిమ్మల్ని బాధాకరమైన శిక్ష పట్టుకుంటుంది

Choose other languages: