Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #53 Translated in Telugu

أَهَٰؤُلَاءِ الَّذِينَ أَقْسَمْتُمْ لَا يَنَالُهُمُ اللَّهُ بِرَحْمَةٍ ۚ ادْخُلُوا الْجَنَّةَ لَا خَوْفٌ عَلَيْكُمْ وَلَا أَنْتُمْ تَحْزَنُونَ
వీరీకీ, అల్లాహ్ తన కారుణ్యాన్ని ఏ మాత్రం ప్రసాదించడు.` అని మీరు ప్రమాణాలు చేసి చెబుతూ ఉండేవారు, వీరే కదా? (చూడండి వారితో ఇలా అనబడింది): `మీరు స్వర్గంలో ప్రవేశించండి, మీకు ఎలాంటి భయమూ ఉండదు మరియు మీరు దుఃఖపడరు కూడా
وَنَادَىٰ أَصْحَابُ النَّارِ أَصْحَابَ الْجَنَّةِ أَنْ أَفِيضُوا عَلَيْنَا مِنَ الْمَاءِ أَوْ مِمَّا رَزَقَكُمُ اللَّهُ ۚ قَالُوا إِنَّ اللَّهَ حَرَّمَهُمَا عَلَى الْكَافِرِينَ
మరియు నరకవాసులు స్వర్గవాసులతో: కొద్ది నీళ్ళో లేక అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారంలో నుండైనా కొంత మా వైపుకు విసరండి." అని అంటారు. (దానికి స్వర్గవాసులు): నిశ్చయంగా అల్లాహ్! ఈ రెండింటినీ సత్యతిరస్కారులకు నిషేధించి వున్నాడు." అని అంటారు
الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَهْوًا وَلَعِبًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ نَنْسَاهُمْ كَمَا نَسُوا لِقَاءَ يَوْمِهِمْ هَٰذَا وَمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ
వీరే, వారు; ఎవరైతే తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా చేసుకున్నారో. మరియు ఇహలోక జీవితం వారిని మోసానికి గురి చేసింది. (అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): వారు ఈనాటి సమావేశాన్ని మరచి, మా సూచనలను తిరస్కరించినట్లు, ఈనాడు మేమూ వారిని మరచిపోతాము
وَلَقَدْ جِئْنَاهُمْ بِكِتَابٍ فَصَّلْنَاهُ عَلَىٰ عِلْمٍ هُدًى وَرَحْمَةً لِقَوْمٍ يُؤْمِنُونَ
మరియు వాస్తవానికి మేము వారికి గ్రంథాన్ని ప్రసాదించి, దానిని జ్ఞానపూర్వకంగా స్పష్టంగా వివరించి ఉన్నాము. అది విశ్వసించే వారికి ఒక మార్గదర్శిని, మరియు కారుణ్యం
هَلْ يَنْظُرُونَ إِلَّا تَأْوِيلَهُ ۚ يَوْمَ يَأْتِي تَأْوِيلُهُ يَقُولُ الَّذِينَ نَسُوهُ مِنْ قَبْلُ قَدْ جَاءَتْ رُسُلُ رَبِّنَا بِالْحَقِّ فَهَلْ لَنَا مِنْ شُفَعَاءَ فَيَشْفَعُوا لَنَا أَوْ نُرَدُّ فَنَعْمَلَ غَيْرَ الَّذِي كُنَّا نَعْمَلُ ۚ قَدْ خَسِرُوا أَنْفُسَهُمْ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ
ఏమీ? వారు (అవిశ్వాసులు) దాని తుది ఫలితం సంభవించాలని నిరీక్షిస్తున్నారా? దాని తుది ఫలితం సంభవించే దినమున, దానిని నిర్లక్ష్యం చేసినవారు: వాస్తవానికి మా ప్రభువు పంపిన ప్రవక్తలు సత్యం తెచ్చారు. అయితే ఏమీ? మా కొరకు సిఫారసు చేయటానికి, సిఫారసుదారులు ఎవరైనా ఉన్నారా? లేదా మేము మళ్ళీ తిరిగి (భూలోకంలోకి) పంపబడితే మేమింత వరకు చేసిన కర్మలకు విరుద్ధంగా చేసేవారం కదా?" అని పలుకుతారు. వాస్తవానికి వారు తమకు తాము నష్టం కలిగించుకున్నారు మరియు వారు కల్పించుకున్న (దైవాలన్నీ) వారిని త్యజించి ఉంటాయి

Choose other languages: