Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #192 Translated in Telugu

قُلْ لَا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ وَلَوْ كُنْتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ ۚ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِقَوْمٍ يُؤْمِنُونَ
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం గానీ, నష్టం గానీ చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయజ్ఞానం ఉండి ఉన్నట్లైతే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే
هُوَ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَجَعَلَ مِنْهَا زَوْجَهَا لِيَسْكُنَ إِلَيْهَا ۖ فَلَمَّا تَغَشَّاهَا حَمَلَتْ حَمْلًا خَفِيفًا فَمَرَّتْ بِهِ ۖ فَلَمَّا أَثْقَلَتْ دَعَوَا اللَّهَ رَبَّهُمَا لَئِنْ آتَيْتَنَا صَالِحًا لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ
ఆయనే, మిమ్మల్ని ఒకే వ్యక్తి నుండి సృష్టించాడు మరియు అతని నుండియే జీవిత సౌఖ్యం పొందటానికి అతని భార్యను (జౌజను) పుట్టించాడు. అతను ఆమెను కలుసుకున్నపుడు, ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది. పిదప ఆమె గర్భభారం అధికమైనప్పుడు, వారు ఉభయులూ కలిసి వారి ప్రభువైన అల్లాహ్ ను ఇలా వేడుకుంటారు: నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పక నీకు కృతజ్ఞతలు తెలిపే వారమవుతాము
فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا ۚ فَتَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ
ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప వారు, ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు. కాని వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ మహోన్నతుడు
أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ
ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, వారు ఆయనకు సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తారా
وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنْفُسَهُمْ يَنْصُرُونَ
మరియు వారు, వారికి ఎలాంటి సహాయం చేయలేరు. మరియు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు

Choose other languages: