Quran Apps in many lanuages:

Surah Al-Araf Ayahs #195 Translated in Telugu

أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ
ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, వారు ఆయనకు సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తారా
وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنْفُسَهُمْ يَنْصُرُونَ
మరియు వారు, వారికి ఎలాంటి సహాయం చేయలేరు. మరియు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు
وَإِنْ تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَتَّبِعُوكُمْ ۚ سَوَاءٌ عَلَيْكُمْ أَدَعَوْتُمُوهُمْ أَمْ أَنْتُمْ صَامِتُونَ
మరియు మీరు వారిని సన్మార్గానికి పిలిచినా, వారు మిమ్మల్ని అనుసరించలేరు. మీరు వారిని పిలిచినా, లేక మౌనం వహించినా మీకు సమానమే
إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ عِبَادٌ أَمْثَالُكُمْ ۖ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ
నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను విడిచి ఎవరినైతే పిలుస్తున్నారో, వారు కూడా మీలాంటి దాసులే! మీరు వారిని పిలువండి, మీరు సత్యవంతులే అయితే మీ పిలుపుకు వారు సమాధానమివ్వాలి
أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا ۖ أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۗ قُلِ ادْعُوا شُرَكَاءَكُمْ ثُمَّ كِيدُونِ فَلَا تُنْظِرُونِ
ఏమీ? వారికి కాళ్ళున్నాయా, వాటితో నడవటానికి? లేదా వారికి చేతులున్నాయా, వాటితో పట్టుకోవటానికి? లేదా వారికి కళ్ళున్నాయా, వాటితో చూడటానికి? లేదా వారికి చెవులున్నాయా, వాటిలో వినటానికి? వారితో అను: మీరు సాటి కల్పించిన వారిని (భాగస్వాములను) పిలువండి. తరువాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు (వ్యూహాలు) పన్నండి, నాకు గడువు కూడా ఇవ్వకండి

Choose other languages: