Quran Apps in many lanuages:

Surah Al-Anbiya Ayahs #102 Translated in Telugu

إِنَّكُمْ وَمَا تَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنْتُمْ لَهَا وَارِدُونَ
(వారితో ఇంకా ఇలా అనబడుతుంది): నిశ్చయంగా, మీరు మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవారూ, నరకాగ్నికి ఇంధనమవుతారు! (ఎందుకంటే) మీకు అక్కడికే పోవలసి ఉన్నది
لَوْ كَانَ هَٰؤُلَاءِ آلِهَةً مَا وَرَدُوهَا ۖ وَكُلٌّ فِيهَا خَالِدُونَ
ఒకవేళ ఇవన్నీ ఆరాధ్య దైవాలే అయి వుంటే, ఇవి అందులో (నరకంలో) ప్రవేశించి ఉండేవి కావు కదా! ఇక మీరంతా అందులోనే శాశ్వతంగా ఉంటారు
لَهُمْ فِيهَا زَفِيرٌ وَهُمْ فِيهَا لَا يَسْمَعُونَ
అందులో వారు (దుఃఖం చేత) మూలుగుతూ ఉంటారు. అందులో వారేమి వినలేరు
إِنَّ الَّذِينَ سَبَقَتْ لَهُمْ مِنَّا الْحُسْنَىٰ أُولَٰئِكَ عَنْهَا مُبْعَدُونَ
నిశ్చయంగా, ఎవరి కొరకైతే మా తరఫు నుండి మేలు (స్వర్గం) నిర్ణయింపబడివుందో, అలాంటి వారు దాని (నరకం) నుండి దూరంగా ఉంచబడతారు
لَا يَسْمَعُونَ حَسِيسَهَا ۖ وَهُمْ فِي مَا اشْتَهَتْ أَنْفُسُهُمْ خَالِدُونَ
వారు దాని మెల్లని శబ్దం కూడా వినరు. వారు తాము కోరిన వాటిలో శాశ్వతంగా ఉంటారు

Choose other languages: