Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #97 Translated in Telugu

وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ قَالَ أُوحِيَ إِلَيَّ وَلَمْ يُوحَ إِلَيْهِ شَيْءٌ وَمَنْ قَالَ سَأُنْزِلُ مِثْلَ مَا أَنْزَلَ اللَّهُ ۗ وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلَائِكَةُ بَاسِطُو أَيْدِيهِمْ أَخْرِجُوا أَنْفُسَكُمُ ۖ الْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنْتُمْ تَقُولُونَ عَلَى اللَّهِ غَيْرَ الْحَقِّ وَكُنْتُمْ عَنْ آيَاتِهِ تَسْتَكْبِرُونَ
మరియు అల్లాహ్ పై అబద్ధపు నింద మోపే వాని కంటే, లేదా తనపై ఏ దివ్య జ్ఞానం (వహీ) అవతరించక పోయినప్పటికీ: నాపై దివ్యజ్ఞానం అవతరింప జేయబడుతుంది." అని చేప్పేవాని కంటే, లేదా: అల్లాహ్ అవతరింప జేసినటువంటి విషయాలను నేను కూడా అవతరింపజేయగలను." అని పలికే వాని కంటే, మించిన దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గులు మరణ వేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: మీ ప్రాణాలను వదలండి! అల్లాహ్ పై అసత్యాలు పలుకుతూ ఉన్నందు వలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది!" అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది
وَلَقَدْ جِئْتُمُونَا فُرَادَىٰ كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ وَتَرَكْتُمْ مَا خَوَّلْنَاكُمْ وَرَاءَ ظُهُورِكُمْ ۖ وَمَا نَرَىٰ مَعَكُمْ شُفَعَاءَكُمُ الَّذِينَ زَعَمْتُمْ أَنَّهُمْ فِيكُمْ شُرَكَاءُ ۚ لَقَدْ تَقَطَّعَ بَيْنَكُمْ وَضَلَّ عَنْكُمْ مَا كُنْتُمْ تَزْعُمُونَ
మరియు వాస్తవంగా, మేము మొదటి సారి మిమ్మల్ని పుట్టించినట్లే, మీరిప్పుడు మా వద్దకు ఒంటరిగా వచ్చారు. మరియు మేము ఇచ్చినదంతా, మీరు మీ వీపుల వెనుక వదలి వచ్చారు. మరియు మీరు అల్లాహ్ కు సాటిగా (భాగస్వాములుగా) కల్పించిన మీ సిఫారసుదారులను, మేము మీతో పాటు చూడటం లేదే! వాస్తవంగా ఇప్పుడు మీ మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగి పోయాయి మరియు మీ భ్రమలన్నీ మిమ్మల్ని త్యజించాయి
إِنَّ اللَّهَ فَالِقُ الْحَبِّ وَالنَّوَىٰ ۖ يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَمُخْرِجُ الْمَيِّتِ مِنَ الْحَيِّ ۚ ذَٰلِكُمُ اللَّهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
నిశ్చయంగా, ధాన్యమును మరియు ఖర్జూరపు బీజాన్ని చీల్చే (మొలకెత్త జేసే) వాడు అల్లాహ్ మాత్రమే. ఆయనే సజీవమైన దానిని, నిర్జీవమైన దాని నుండి తీస్తాడు. మరియు నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి తీస్తాడు. ఆయనే, అల్లాహ్! అయితే మీరెందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)
فَالِقُ الْإِصْبَاحِ وَجَعَلَ اللَّيْلَ سَكَنًا وَالشَّمْسَ وَالْقَمَرَ حُسْبَانًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ
ఆయనే (రాత్రి చీకటిని) చీల్చి ఉదయాన్ని తెచ్చేవాడు. మరియు రాత్రిని విశ్రాంతి కొరకు చేసినవాడు మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి (కాల) గణన కొరకు నియమించిన వాడు. ఇవన్నీ ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని, నియమకాలే
وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ النُّجُومَ لِتَهْتَدُوا بِهَا فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
మరియు ఆయనే మీ కొరకు చీకట్లలో - భూమి మీద మరియు సముద్రంలో - మార్గాలను తెలుసు కోవటానికి, నక్షత్రాలను పుట్టించాడు. వాస్తవానికి, ఈ విధంగా మేము జ్ఞానవంతుల కొరకు మా సూచనలను వివరించి తెలిపాము

Choose other languages: