Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #99 Translated in Telugu

إِنَّ اللَّهَ فَالِقُ الْحَبِّ وَالنَّوَىٰ ۖ يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَمُخْرِجُ الْمَيِّتِ مِنَ الْحَيِّ ۚ ذَٰلِكُمُ اللَّهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
నిశ్చయంగా, ధాన్యమును మరియు ఖర్జూరపు బీజాన్ని చీల్చే (మొలకెత్త జేసే) వాడు అల్లాహ్ మాత్రమే. ఆయనే సజీవమైన దానిని, నిర్జీవమైన దాని నుండి తీస్తాడు. మరియు నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి తీస్తాడు. ఆయనే, అల్లాహ్! అయితే మీరెందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)
فَالِقُ الْإِصْبَاحِ وَجَعَلَ اللَّيْلَ سَكَنًا وَالشَّمْسَ وَالْقَمَرَ حُسْبَانًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ
ఆయనే (రాత్రి చీకటిని) చీల్చి ఉదయాన్ని తెచ్చేవాడు. మరియు రాత్రిని విశ్రాంతి కొరకు చేసినవాడు మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి (కాల) గణన కొరకు నియమించిన వాడు. ఇవన్నీ ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని, నియమకాలే
وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ النُّجُومَ لِتَهْتَدُوا بِهَا فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
మరియు ఆయనే మీ కొరకు చీకట్లలో - భూమి మీద మరియు సముద్రంలో - మార్గాలను తెలుసు కోవటానికి, నక్షత్రాలను పుట్టించాడు. వాస్తవానికి, ఈ విధంగా మేము జ్ఞానవంతుల కొరకు మా సూచనలను వివరించి తెలిపాము
وَهُوَ الَّذِي أَنْشَأَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ فَمُسْتَقَرٌّ وَمُسْتَوْدَعٌ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَفْقَهُونَ
మరియు ఆయనే మిమ్మల్ని ఒకే వ్యక్తి (ప్రాణి) నుండి పుట్టించి, తరువాత నివాసం మరియు సేకరించబడే స్థలం నియమించాడు. వాస్తవంగా, అర్థం చేసుకునే వారికి ఈ విధంగా మేము మా సూచనలను వివరించాము
وَهُوَ الَّذِي أَنْزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ نَبَاتَ كُلِّ شَيْءٍ فَأَخْرَجْنَا مِنْهُ خَضِرًا نُخْرِجُ مِنْهُ حَبًّا مُتَرَاكِبًا وَمِنَ النَّخْلِ مِنْ طَلْعِهَا قِنْوَانٌ دَانِيَةٌ وَجَنَّاتٍ مِنْ أَعْنَابٍ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُشْتَبِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۗ انْظُرُوا إِلَىٰ ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَيَنْعِهِ ۚ إِنَّ فِي ذَٰلِكُمْ لَآيَاتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ
మరియు ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు తరువాత దాని ద్వారా మేము సర్వలోకాల వృక్షకోటిని ఉద్భవింపజేశాము. మరియు దాని నుండి మేము పచ్చని పైరును పండించాము. వాటిలో దట్టమైన గింజలను పుట్టించాము. మరియు ఖర్జూరపు చెట్ల గెలల నుండి క్రిందికి వ్రేలాడుతున్న పండ్ల గుత్తులను, ద్రాక్ష, జైతూన్ మరియు దానిమ్మ తోటలను (పుట్టించాము). వాటిలో కొన్ని ఒకదాని నొకటి పోలి ఉంటాయి, మరికొన్ని ఒకదాని నొకటి పోలి ఉండవు. ఫలించినప్పుడు వాటి ఫలాలను మరియు వాటి పరిపక్వాన్ని గమనించండి. నిశ్చయంగా, వీటిలో విశ్వసించే వారికి సూచనలున్నాయి

Choose other languages: